Dailyhunt
శివాజీ డ్రెస్సింగ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన గాయత్రీ గుప్తా

శివాజీ డ్రెస్సింగ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన గాయత్రీ గుప్తా

Gayathri Gupta

హిళల డ్రెస్సింగ్ గురించి టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ నటి గాయత్రీ గుప్తా శివాజీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
"నేను ఏ దుస్తులు వేసుకోవాలి అనేది నా వ్యక్తిగత విషయం. ఎవరు చెప్పారనే కారణంగా నేను మారను. నాకు కంఫర్ట్‌గా అనిపించే దుస్తులే నేను ధరిస్తాను" అని తెలిపారు.

అలాగే "మన దృష్టిలో ఎలా ఉంటే, మనకు ప్రపంచం కూడా అలా కనిపిస్తుంది. ఇతరులను విమర్శించే ముందు మన ఆలోచనలను చూసుకోవాలి" అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట.. అన్నట్టు ఆయన వ్యవహారం ఉందని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మనం చూసే చూపులో లోపం పెట్టుకుని ఎదుటివారిని విమర్శించడం సరికాదని హితవు పలికారు. కొందరు ఆమెకు మద్దతు ఇస్తూ, డ్రెస్సింగ్ అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛ అని అంటున్నారు.

కాగా, గతంలో శివాజీ మహిళల డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ, చీర వంటి సాంప్రదాయ దుస్తులు ధరించడం మంచిదని, వెస్ట్రన్ దుస్తుల కంటే అవే గౌరవంగా ఉంటాయని అన్నట్లు ప్రచారం జరిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu