Secunderabad Railway Station
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఆరేళ్ల బాలుడు అపహరణకు గురైనట్లు ఆరోపణలు రావడంతో ఆందోళన నెలకొంది. సుమారు 15 వారాల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

