సినీ రంగంలో వుండేవారికి చదువు, సంస్కారం, శీలం వుండవని, తాగుబోతులు, తిరుగుబోతులు, వాగుబోతులు వుంటారని పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు చేసారు. అట్లాంటివారు సినిమాల్లో వుంటే వారి గురించి వ్యాఖ్యానించేదేమి ఏమీ వుండదనీ, ఐతే రాజకీయాల్లోకి వస్తే మటుకు వారిని విమర్శించకుండా వుండబోమని ఆయన చెప్పుకొచ్చారు.
పాశం మాట్లాడుతూ... ఇప్పటివరకూ వారు ఒక్క దేశభక్తి సినిమా అయినా తీసారా, అన్నీ బూతు సినిమాలే. అసలు సినిమా రంగానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడమే తప్పు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి గతంలో ఎన్టీఆర్ పైన దాడి చేసి, చెప్పులతో కొట్టినవారే. ఇప్పుడు ఆయన విగ్రహాలు పెడుతున్నారు.
పవన్ కల్యాణ్ గతంలో చేగువేరా బొమ్మ పెట్టుకుని, తను కమ్యూనిస్టునని చెప్పుకుంటూ ప్రజా గాయకుడు గద్దర్‌ను నమ్మించి మోసం చేసాడు. ఇలాంటి వారిని హైదరాబాదులో అడుగుపెట్టనీయకూడదు అంటూ మాట్లాడారు.

