Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sureshbabu: నాగబంధం సెట్ అభిషేక్ చూడమని చెప్పారు, అద్భుతమైన విజువల్స్ వున్నాయి : డి. సురేష్ బాబు

Sureshbabu: నాగబంధం సెట్ అభిషేక్ చూడమని చెప్పారు, అద్భుతమైన విజువల్స్ వున్నాయి : డి. సురేష్ బాబు

Suresh Babu, Virat Karna, Abhishek Nama and others

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం - ది సీక్రెట్ ట్రెజర్'.
నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ నిర్వహించారు. నిర్మాత సురేష్ బాబు ఈ వేడుకకు ముఖ్య అతిథి గా హాజరయ్యారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు పెద్ద సెట్ వేసినప్పుడు అభిషేక్ నాకు ఫోన్ చేసి వచ్చి చూడమని చెప్పేవారు. తను అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కూడా చాలా చక్కని వర్క్ ఇచ్చారు. అశోక్ నాకు 'ఇంద్రుడు చంద్రుడు', 'కలిసుందాం రా' సినిమాలప్పటి నుంచి పరిచయం. తను ఈ సినిమాకి అద్భుతమైన వర్క్ ఇచ్చాడు. ఇది చాలా కాస్ట్లీగా తీసిన సినిమా. నేను రషెస్ చూశాను. అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేశారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు అభిషేక్ నామా మాట్లాడుతూ... ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి మరెన్నో గొప్ప సినిమాలు వస్తాయి. అందరూ ఈ సినిమాను థియేటర్‌కు వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నేను, మా డీవోపీ గారు, అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు అనంత పద్మనాభస్వామి వారి ఆలయానికి వెళ్లాము. అక్కడ ఫొటోలు తీసేందుకు అనుమతి లేదు. అందుకే మేము ఆ ఆలయాన్ని ప్రత్యక్షంగా చూసి, పేపర్‌పై స్కెచ్‌లు గీసుకుని, అదే ఆధారంగా ఆ సెట్‌ను నిర్మించాము.

మన సంస్కృతి, మన మూలాలు, సనాతన ధర్మానికి సంబంధించిన ఒక గొప్ప సందేశం కూడా ఈ సినిమాలో ఉంటుంది. అది చాలా గొప్పగా వచ్చింది. ప్రేక్షకులు కచ్చితంగా ఒక అద్భుతమైన సినిమాను, గొప్ప అనుభూతిని ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు.

హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ..ఈ సినిమాను ఒక మ్యాజికల్ అనుభూతిలా తీర్చిదిద్దారు. మా నిర్మాతలు కిషోర్ గారు, నిశిత గారు అద్భుతమైన వ్యక్తులు. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు థియేటర్లలోనే చూడాలి. మా టీమ్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్. జూలై 3న తప్పకుండా అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.

నిర్మాత కిషోర్ మాట్లాడుతూ... రూ.110 కోట్లకు పైగా పెట్టి తీసిన సినిమా ఇది. ఈ రోజుల్లో సినిమాకి మూడు రోజులే లైఫ్. ఆ మూడు రోజుల్లో ఏదైనా జరగొచ్చు. అందుకే కొద్ది రోజులుగా కొంచెం టెన్షన్ పడ్డాను. అయితే ఫైనల్ మిక్స్ అయిన తర్వాత అభిషేక్ సినిమా చూపించారు. ఇప్పుడు నాకున్న టెన్షన్ అంతా పోయింది. మీరు ఒక విజువల్ వండర్‌ను చూడబోతున్నారు. సినిమా ట్రెమండస్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ప్రతి 10 నిమిషాలకు ఒక డిఫరెంట్ వరల్డ్‌ను చూస్తారు. ఒక సినిమాలోనే నాలుగైదు విజువల్ వండర్స్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ చాలా సాటిస్ఫై అవుతారు. కచ్చితంగా ఇది ష్యూర్‌షాట్ బ్లాక్‌బస్టర్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu