'పీఎస్‌ఎల్ మొదలై ఇప్పటికి పదేళ్లు అయింది. కానీ, ఒక్క సంచలన బ్యాటర్‌నైనా ఆ లీగ్ అందించిందా? అవును మేం బౌలింగ్‌లో మంచి ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చాం.. కానీ, బ్యాటింగ్‌లో గొప్ప టాలెంట్ ఉన్న ప్లేయర్లను పట్టుకోలేకపోయాం. భారత్‌లో వైభవ్ వంటి కుర్రాడు దొరికాడు. మరి మనం ఆ స్థాయికి ఎప్పటికి చేరుతాం? పాకిస్థాన్‌లో టెస్టు క్రికెట్ బతకాలంటే క్లబ్ క్రికెట్‌ను పునరుద్ధరించాలి. ప్రతిభ కలిగిన ప్లేయర్లు ఎక్కువగా అక్కడి నుంచే వస్తున్నారు. కరాచీ, లాహోర్‌లో భారీగా ఖర్చు చేయాలి. అప్పుడే పాక్ జాతీయ జట్టుకు నాణ్యమైన ప్లేయర్లు వస్తారు' అని వసీం అక్రమ్ తెలిపాడు.
అఫ్ఘనిస్థాన్‌తో ఆదివారం నుంచి మూడు టీ20ల సిరీస్ మొదలుకానుంది. అయితే, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇందులో ఆడే అవకాశాలు తక్కువనేని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. వరల్డ్ కప్ త్రయం అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఆడే నేపథ్యంలో వైభవ్‌కు ఛాన్స్ కష్టమే. అయితే, ఇషాన్‌కు ప్రాక్టీస్ సమయంలో గాయమైన సంగతి తెలిసిందే. ఒకవేళ అతడు ఫిట్‌గా లేకపోతే వైభవ్‌కే అవకాశం రావచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

