Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సుస్మితా సేన్ ఓ డైమండ్ డిగ్గర్.. కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉండేవాడిని: లలిత్ మోదీ

సుస్మితా సేన్ ఓ డైమండ్ డిగ్గర్.. కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉండేవాడిని: లలిత్ మోదీ

Lalit Modi-Sushmita Sen

బాలీవుడ్ స్టార్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ తన జీవితంలో ఎప్పటికీ వెరీ స్పెషల్ అంటూ ఐపీఎల్ మాజీ చైర్మన్, వ్యాపారవేత్త లలిత్ మోదీ అన్నారు.
వీరిద్దరి రిలేషన్‌షిప్ 2022లో సంచలనానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. వీరిద్దరూ ఎప్పుడో విడిపోయారు. తాజాగా లలిత్ మోదీ ఈ రిలేషన్‌షిప్‌పై ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. లలిత్ మోదీ డబ్బు చూసే ఆమె ప్రేమించిందంటూ గోల్డ్ డిగ్గర్ అని కామెంట్స్ చేశారు. ఈ ఆరోపణలపై లలిత్ మోదీ తీవ్రంగా స్పందించారు.

సుస్మిత చాలా అందమైన, సొంతంగా ఎదిగిన మహిళ. ఆమె ఎవరి డబ్బు పైనా ఆధారపడలేదు. మా ఇద్దరిలో ఎప్పుడు బయటకు వెళ్లినా రూపాయి కూడా తనను ఖర్చు పెట్టనిచ్చేది కాదు. అన్నింటికీ ఆమెనే డబ్బులు కట్టేది. నిజం చెప్పాలంటే తాను ఆమె దగ్గర ఒక కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉండేవాడిని అంటూ చెప్పుకొచ్చారు. ఆమె ఎవరి దగ్గర నుండి ఏమీ ఆశించదని, అందుకే ఆమెను గోల్డ్ డిగ్గర్ అనడం పూర్తిగా తప్పన్నారు.

ఒకవేళ అనాలనుకుంటే తనను డైమండ్ డిగ్గర్ అనవచ్చని, ఎందుకంటే సుస్మిత ఒక రియల్ డైమండ్ అని అన్నారు. సుస్మిత సేన్ ధనవంతురాలని, ప్రపంచంలోనే అత్యధికంగా వజ్రాలు ఉన్న మహిళ సుస్మితా సేన్ అని లలిత్ మోదీ చెప్పుకొచ్చారు. అవన్నీ ఆమె సొంత కష్టంతో సంపాదించుకుంది. ఆమెకు డైమండ్ స్టోర్స్ కూడా ఉన్నాయని లలిత్ మోదీ వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu