Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : విజయ్ పోటీ చేసిన రెండు చోట్లా విజయమే...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : విజయ్ పోటీ చేసిన రెండు చోట్లా విజయమే...

Vijay

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ పోటీ చేసిన రెండు చోట్లా గెలుపొందారు. తద్వారా తమిళ రాజకీయాల్లో అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి చూపించారు.
రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కేవలం రెండేళ్ల రెండు మాసాల వ్యవధిలోనే చరిత్ర లిఖించారు. టీవీకే ఏర్పాటైన తర్వాత తొలిసారి జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో విజిల్‌ వేయించి మెజార్టీ స్థానాలు గెలిచి అటు సినిమాల్లోనే కాదు.. ఇటు పాలిటిక్స్‌లోనూ సూపర్‌ హిట్‌ కొట్టారు.

ఈ ఎన్నికల్లో ఆయన చెన్నై జిల్లాలోని పెరంబూర్, తిరుచ్చి జిల్లాలోని తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన జోసెఫ్‌ విజయ్‌ చంద్రశేఖర్‌.. తన ప్రత్యర్థులను చిత్తుగా ఓడించారు. పెరంబూర్‌లో డీఎంకే అభ్యర్థి ఆర్డీ శేఖర్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించగా తిరుచ్చి ఈస్ట్‌లోనూ అదే పార్టీ అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్‌పై గెలుపొంది సత్తా చాటారు.

కొన్ని ఎగ్జిట్‌పోల్స్‌, కొందరు రాజకీయ విశ్లేషకులు ఈ ఎన్నికల్లో విజయ్‌ ప్రభావం అంతగా ఏమీ ఉండకపోవచ్చని.. ఆయన ఓట్లు చీలుస్తారని, ఒకవేళ హంగ్‌ వస్తే ఆయన కింగ్‌మేకర్‌ అవుతారంటూ రకరకాల అంచనాలు వెలువరించారు. కానీ, వాటన్నింటినీ తారుమారు చేస్తూ అనూహ్యంగా టీవీకే అత్యధికంగా 110 స్థానాలు గెలుచుకోవడంతో ఆయన కింగ్‌గా అవతరించడం ఇప్పుడు దేశమంతా హాట్‌టాపిక్‌ అయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu