Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : విజిల్ వేసిన విజయ్ ఫ్యామిలీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : విజిల్ వేసిన విజయ్ ఫ్యామిలీ

మిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్‌ నేతృత్వంలోని టీవీకే విజయపథంలో దూసుకెళుతోంది. మొత్తం 234 స్థానాలకు గాను 114 స్థానాలలో గెలుపు దిశగా పయనిస్తోంది.
దీంతఓ ఆ పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక విజయ్‌ కుటుంబ సభ్యులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. టీవీకే పార్టీ గుర్తు అయిన విజిల్‌ వేస్తూ ఎంజాయ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తమిళనాడులో 118 మ్యాజిక్‌ ఫిగర్‌ కాగా.. టీవీకే 114 స్థానాల్లో ముందంజలో ఉంది.

టీవీకే పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. దీంతో ఆ పార్టీ అధినేత విజయ్‌ ఇంటి వద్ద గెలుపు సంబరాలు మొదలయ్యాయి. నటి త్రిష కూడా విజయ్‌ ఇంటికి చేరుకున్నారు. మే 4వ తేదీన పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్లిన ఆమె.. అక్కడి నుంచి నేరుగా విజయ్‌ ఇంటికి చేరుకున్నారు.

మరోవైపు అభిమానులు, కార్యకర్తలు విజయ్‌ ఇంటి వద్దకు భారీగా తరలివస్తున్నారు. విజిల్‌ వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. గెలుపు నేపథ్యంలో అధికారులు ఆయన ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటుచేశారు. ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సంబరాల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu