Jagan_Vijay
దళపతి విజయ్ తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి కానున్నారు. దీనిపై ట్రెండ్‌లు స్పష్టంగా ఉన్నా.. ఆయన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరా లేక ఇతరుల సహాయం తీసుకుంటారా అనేది తెలియాల్సి వుంది. విజయ్ సాధించిన విజయంతో సోషల్ మీడియా మొత్తం సందడిగా ఉంది.
జగన్ అభిమానులు ఈ క్షణాన్ని తమ వ్యక్తిగత విజయంగా భావించి సంబరాలు చేసుకోవడం గమనార్హం. వారు జగన్, విజయ్ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను ప్రచారం చేస్తున్నారు. జగన్, విజయ్ ఇటీవల ఒక వివాహ వేడుకలో కలుసుకున్నారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని ఒకరినొకరు పలకరించుకోవడం కనిపించింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు ప్రాథమికంగా ఈ క్షణాన్ని తమ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వారు అలాంటి ఫోటోలు, వీడియోలకు ఒకే ఫ్రేములో తమిళనాడు 2026 సీఎం, ఏపీ 2029 సీఎం అని క్యాప్షన్లు కూడా పెడుతున్నారు.
ఒకవేళ డీఎంకే గెలిచి ఉంటే, వారు జగన్‌తో ఎంకే స్టాలిన్ ఉన్న ఫోటోలు, వీడియోలను ప్రచారం చేసి ఉండేవారు. 2019లో జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంకే స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదంతా పాలిటిక్స్ ట్రిక్స్.

