Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాట మళ్లీ ఉదయిస్తున్న సూర్యుడు, పశ్చిమ బెంగాల్‌లో దీదీ భాజపా నువ్వా-నేనా?

తమిళనాట మళ్లీ ఉదయిస్తున్న సూర్యుడు, పశ్చిమ బెంగాల్‌లో దీదీ భాజపా నువ్వా-నేనా?

నుకున్నదే జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీవీకే విజయ్ పార్టీ అటు అన్నాడీఎంకెను ఇటు తన సొంత ఓట్లను చీల్చి చెండాడినట్లు అర్థమవుతోంది. దీనితో డీఎంకే మెజారిటీ సీట్లు దక్కించుకునే దిశలో వెళుతోంది.
మరోవైపు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మరోసారి తన పట్టు నిలుపుకునే దిశలో సాగుతోంది. ప్రారంభ ట్రెండ్స్ చూస్తుంటే పరిస్థితి ఇలా వుంది.

తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు 2026 లైవ్, తమిళనాడు అసెంబ్లీ స్థానాలు 234 వుండగా మేజిక్ ఫిగర్ (మెజారిటీ) 118 వచ్చిన పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు డీఎంకేకి పట్టం కట్టేసాయి. అనుకున్నట్లే ట్రెండ్స్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికి డిఎంకె కూటమికి పైచేయి కనిపిస్తోంది, విజయ్ పార్టీ (TVK) ఓట్లను చీల్చడం వల్ల ఫలితాల్లో అనూహ్య మార్పులు వచ్చే అవకాశం ఉంది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు అని, తమ పార్టీ 200 కంటే ఎక్కువ సీట్లు సాధించి నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బెంగాల్‌లో దాదాపు 92% పైగా భారీ ఓటింగ్ నమోదైంది. ఈ భారీ ఓటింగ్ ఎవరికి ప్లస్ అవుతుందనేది ఉత్కంఠగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu