
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్న కేసులతో షాక్ తప్పట్లేదు. రాష్ట్రంలో సోమవారం తగ్గిన కరోనా కేసులు మళ్లీ రెండువేల మార్కును దాటాయి. గత 24 గంటల్లో సోమవారం తెలంగాణలో కొత్తగా 2,166 కరోనా కేసులు నమోదైనాయి. ఇంకా కరోనా కారణంగా పది మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,74,774 కి చేరగా.. మరణాల సంఖ్య 1,052 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అయితే.. సోమవారం ఒక్కరోజే వైరస్ నుంచి 2,143 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,44,073 మంది బాధితులు కోలుకోగా..
ప్రస్తుతం తెలంగాణలో 29,649 మంది చికిత్స పొందుతున్నారు.