Dailyhunt
Thalapati Vijay: దళపతి విజయ్‌కీ చిరంజీవి సబంధం గురించి చెప్పిన SA చంద్రశేఖర్

Thalapati Vijay: దళపతి విజయ్‌కీ చిరంజీవి సబంధం గురించి చెప్పిన SA చంద్రశేఖర్

Chiranjeevi, S.A. Chandrasekhar

మిళనాడులో ఘనవిజయాన్ని సాధించి సి.ఎం. కాబోతున్న దళపతి విజయ్ గురించి ఇప్పుడు రకరకాలు వీడియోలు బయటకు వస్తున్నాయి.
విజయ్ తండ్రి SA చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు అన్న విషయం తెలిసిందే. ఆయన తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో చట్టానికి కళ్ళు లేవు అనే సినిమాను తెరకెక్కించాడు. ఆ చిత్రం విజయం సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన అప్పట్లో ఆ సినిమా విషయాలు గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో రన్ అవుతోంది.

ఆయన మాట్లాడుతూ, చిరంజీవితో మొదటి సినిమా చేసేటైంకు నాకు తెలుగు రాదు. అయితే నెక్ట్స్ సినిమాకు తెలుగులో మాట్లాడాలని అన్నారు. ట్రై చేస్తాను అన్నా. 80 దశకంలోని మాట. దేవాంతకుడు సినిమా ఫంక్షన్ సికింద్రాబాద్ సంథ్య థియేటర్లో జరుగుతోంది. మీరు ఆ ఫంక్షన్లో తెలుగులో మాట్లాడాలి అని చిరంజీవిగారు అన్నారు. ఆ విషయం ఇప్పటికీ గుర్తుంది నాకు. కానీ అప్పుడు చెడ్డ తెలుగులో మాట్లాడాను. ఆ తర్వాత నన్ను హగ్ చేసుకున్నారు. ప్రయత్నం చేశాను కనుక ఆయనకు నచ్చింది.


ఇక చిరంజీవిగారితో బంధం నాకు నా సన్‌తో వున్న బంధం లాంటిది. ఆయన సెట్లో దర్శకులకు గౌరవం ఇస్తారు. సీన్ చేస్తున్నప్పుడు దర్శకుడు ఫేస్‌లో రియాక్షన్ చూసి పసిగట్టేస్తారు. ఆయన హర్డ్ వర్కర్. దానికోసం ప్రిపేర్ అవుతారు. విజయ్ కూడా అలాగే చేస్తాడని తెలిపారు. ఇలా విజయ్ సక్సెస్ తర్వాత ఆయన అనుభవాలను పంచుకున్నారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu