Thiruveer, Aishwarya Rajesh
హీరో తిరువీర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన విలేజ్ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'. భరత్ దర్శన్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.ఈ క్రమంలో చిత్రం నుంచి 'ప్రేమ.. ప్రేమిస్తున్నా' అనే రొమాంటిక్, మెలోడీ పాటను విడుదల చేశారు. ఈ పాటను జేమ్స్ టకారా ఆలపించారు. పూర్ణాచారి లిరిక్స్ ఎంతో చక్కగా ఉన్నాయి. ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో అందరినీ ఆకట్టుకునేలా ఉంది. విలేజ్ వాతావరణం, హీరో హీరోయిన్ ట్రాక్, సింపుల్ కొరియోగ్రాఫీ పాటను అందంగా మలిచింది.
రజాకార్, పోలిమేర చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సి.హెచ్. కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తారు. బలగం ఫేం తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్, క చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీ వరప్రసాద్ ఎడిటర్. స్వయంభు చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. పాపులర్ లిరిక్ రైటర్ పూర్ణచారి ఈ చిత్రంలోని పాటలు రాస్తున్నారు.
ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

