Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Trinadha Rao: సెట్‌కి వెళ్లేటప్పుడు ఫుల్లుగా బిర్యానీ తినేసేవాడ్ని.: త్రినాథరావు నక్కిన

Trinadha Rao: సెట్‌కి వెళ్లేటప్పుడు ఫుల్లుగా బిర్యానీ తినేసేవాడ్ని.: త్రినాథరావు నక్కిన

Trinadha Rao Nakkina, Kandregula Naidu

నకాపల్లి' కథను నేనే రాసుకున్నాను. కానీ తీయకుండా అలా పెట్టేశాను. దర్శకుడిగా జర్నీ మొదలైన తర్వాత సమీకరణాలు మారుతూ వచ్చాయి.
అందుకే నా దగ్గర ఉన్న మంచి కథల్ని భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద తీయాలని అనుకుంటున్నాం. దాదాపు ఈ మూవీని కూడా నేనే తీసినట్టు చెప్పుకోవచ్చు అని త్రినాథరావు నక్కిన చెప్పారు.

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మించారు. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో నిర్మాతలు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు చిత్రానికి సంబంధించిన విషయాల్ని పంచుకున్నారు.

త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ, కాండ్రేగుల నాయుడు నాయుడు అనకాపల్లిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇండస్ట్రీలోకి వస్తానని నాతో ఎప్పుడూ అంటూ ఉండేవాడు. కానీ నేను మాత్రం వద్దు అని అనేవాడ్ని. చివరకు పట్టుదలతో ఇక్కడకు వచ్చి నిర్మాత అయ్యాడు.

ఈ మూవీని పూర్తిగా అనకాపల్లిలోనే షూట్ చేశాం. లొకేషన్స్ రియల్‌గా ఉండాలని మా సొంత ఊర్లోనే తీశాం. ఓ టౌన్‌లో జరిగే లవ్ స్టోరీ. అందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా ఉంటాయి. ఈ కథకి 'అనకాపల్లి' టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది. పైగా సొంతూరు అనే మమకారంతో ఆ పేరు పెట్టాను.

- అనకాపల్లి'లోని మెయిన్ పాయింట్ ... ఇప్పుడున్న జెన్ జీ తరానికి ఎమోషన్స్ తెలియడం లేదు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని మళ్లీ అందరికీ తెలియాలని, గుర్తించాలని ఈ మూవీని తీశాం. ప్రస్తుత తరం ఫ్యామిలీ డ్రామాకి కనెక్ట్ అవ్వాలని తీశాం. ఓ సందేశం ఇవ్వాలని అనుకున్నాను. ఇది నా బాధ్యత అనుకుంటున్నాను. యాక్షన్ ఎక్కువగానే ఉన్నా కూడా ఫ్యామిలీ డ్రామానే డామినేట్ చేస్తుంది.

- నేనూ ఓ దర్శకుడినే అవ్వడంతో ఈ సినిమాకి ఎక్కడెక్కడ ఏం అవసరం పడిందో అక్కడక్కడ బడ్జెట్ పెంచుకుంటూ వెళ్లాను. అందులో ఓ పదిశాతం బడ్జెట్ పెరిగింది. ఓటీటీ డీల్ కూడా పూర్తవుతుంది. అమెజాన్ ప్రైమ్ వాళ్లతో చర్చలు జరుపుతున్నాం. సినిమాని చూసిన తర్వాతే రిలీజ్ చేసేందుకు మైత్రి శశి ముందుకు వచ్చారు.

- నేను చేసిన ఫాదర్ కారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుంది. నాకు యాక్టింగ్ వచ్చు. ప్రతీ దర్శకుడిలో ఓ నటుడు ఉంటాడు. దర్శకుడు, హీరో అందరూ కలిసి నన్ను ఒప్పించారు. నాకు పొట్ట ఉన్నా కూడా ఇంకా పొట్ట కావాలని మా దర్శకుడు అనేవాడు. అందుకే ప్రతీ రోజు సెట్‌కి వెళ్లేటప్పుడు బిర్యానీ ఫుల్లుగా తినేసేవాడ్ని. ఇంద్రజ గారు, విక్రమ్, సంధ్య అద్భుతంగా నటించారు. అసలు ఇందులోని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ పోటీ పడుతూ నటించారు.

- దేవ్‌జండ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. 'ధమాకా' టైంలో కార్తీక్ ద్వారా పరిచయం అయ్యాడు. అలా నేను 'చౌర్యపాఠం'కి అవకాశం ఇచ్చాను. రవితేజ గారు 'ఈగల్'కి ఛాన్స్ ఇచ్చారు. మళ్లీ నేను 'అనకాపల్లి' కోసం అతడ్నే సంప్రదించాను. పాటలు, ఆర్ఆర్ రెండూ అద్భుతంగా వచ్చాయి.

- ముందు మేం ఆగస్ట్ 7న ఫిక్స్ అయ్యాం. అప్పుడు ఈ చిత్రాలన్నీ లేవు. అయితే ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక సినిమా పోటీలో ఉంటుంది. మాకు మా కంటెంట్ మీద నమ్మకం ఉంది. మా నాయుడు కూడా సినిమా మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. అందుకే ఆగస్ట్ 7న రావాలని నిర్ణయించుకున్నాం.

- సెన్సార్ నుంచి మంచి సినిమా తీశారని మెచ్చుకున్నారు. వారికి కూడా ఫ్యామిలీ డ్రామా బాగా నచ్చింది. ఇచ్చిన కట్స్‌ని తీసేస్తే కథ డిస్టర్బ్ అవుతుందని సెన్సార్ సభ్యులే ఫీల్ అయ్యారు.

- ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తెలుపుతూ, నేను రెడీ చిత్రం పూర్తయింది. రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తాం. ప్రస్తుతం దర్శకుడిగా కొన్ని స్క్రిప్ట్‌లు రెడీ చేశాను. నిర్మాతగా సినిమాలు వెంటనే రావు. కాస్త గ్యాప్ ఉంటుంది. 'ధమాకా'ని మించిన కథ, స్క్రిప్ట్ కుదిరితేనే 'ధమాకా-2' గురించి ఆలోచిస్తాను.

కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ, మా సొంత ఊర్లో షూట్ చేయడంతో మాకు బాగా కలిసి వచ్చింది. ప్రతీ ఒక్కరూ మాకు సాయం చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకెంతో సపోర్ట్ చేసింది. నేచురల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం వల్ల అవుట్ పుట్ మరింత ఎఫెక్టివ్‌గా వచ్చింది.

- ఓ సినిమా వెనకాల చాలా మంది కష్టం ఉంటుంది. ఒక బడ్జెట్ పెడుతున్నామంటే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది. కష్టపడేది వాళ్లు అయినా పేరు మాత్రం మాకు వస్తుంది. అందుకే బ్యానర్లు స్థాపించాం. రెగ్యులర్‌గా సినిమాల్ని నిర్మించాలని అనుకుంటున్నాం.

- నాది, త్రినాథరావుది ఒకే ఊరు. హైదరాబాద్‌లోనే ఉన్నా.. అతని మనసు మాత్రం మాతోనే, మా ఊర్లోనే ఉంటుంది. నేను నా జర్నీని త్రినాథరావుతో కంటిన్యూ చేస్తాను. మంచి కథలు వస్తే సొంతంగానూ, ఇతర బ్యానర్లతో సినిమాలు నిర్మిస్తాను.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu