Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం - AK47 టీజర్ వచ్చేసింది

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం - AK47 టీజర్ వచ్చేసింది

Venkatesh, Srinidhi Shetty

బ్బుకు, సబ్బుకు తేడా ఏమిలేదనే సామాన్య కుటుంబం నుంచి ఆదర్శకుటుంబ ఇంటినెంబర్ 47 స్థాయికి ఎలా ఎదిగాడనే పాయింట్ తో ఆదర్శ కుటుంబం - AK47 వుందని టీజర్ చెబుతోంది.
మధ్యతరగతి కుటుంబం.. ఆ కుటుంబంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు.. వాటి చుట్టూ అల్లుకున్న వినోదం.. ఇలా 'ఆదర్శ కుటుంబం - AK47' ప్రపంచాన్ని టీజర్ ఆసక్తికరంగా పరిచయం చేసింది.

వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్‌ చమత్కారమైన రచన, పదునైన సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో టీజర్‌లోని ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

విక్టరీ వెంకటేష్, స్టార్ రైటర్-డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం 'ఆదర్శ కుటుంబం - AK47' టీజర్ తాజాగా విడుదలైంది. కుటుంబ నేపథ్యంతో కూడిన వినోదం, యాక్షన్, చమత్కారమైన సంభాషణలతో టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, ఉదయ్‌బీర్ సంధు, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు. వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

సంగీతం థమన్ ఎస్, ప్రొడక్షన్ డిజైన్ ఏ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్ నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రతిష్ఠాత్మక బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పలు విజయవంతమైన, బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ఈ సంస్థ నుంచి వస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రంగా 'ఆదర్శ కుటుంబం - AK47' రూపొందుతోంది.

టీజర్‌కు లభిస్తున్న స్పందనతో పాటు వెంకటేష్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ రైటింగ్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్, యాక్షన్ అంశాలు, భారీ తారాగణం సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

కుటుంబ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించేలా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం - AK47' అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu