ఇక మిగిలింది చిన్న పార్టీలతో పాటు జాతీయ పార్టీ కాంగ్రెస్. తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలుచుకున్నది. ఈ పార్టీతో విజయ్ ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిపినట్లు సమాచారం. పట్టాలి మక్కల్ కట్చి(PMK)కి 4 సీట్లు వచ్చాయి. కమ్యూనిస్ట్ పార్టీలు CPI/CPM చెరో 2 సీట్లు గెలుచుకున్నాయి. ఇక ఇతర పార్టీలు VCK (2), IUML (2), DMDK (1), AMMK (1) గెలుచుకున్నారు.
విజయ్ తన సిద్ధాంతాలను లౌకిక సామాజిక న్యాయం అని ప్రకటించారు కాబట్టి ఆయన సిద్ధాంతాలకు దగ్గరగా ఉండే పార్టీలతోనే జట్టు కట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ప్రస్తుతం DMK కూటమిలో ఉన్నప్పటికీ, మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బిజెపికి కేవలం 1 సీటు మాత్రమే వచ్చింది. విజయ్ మొదటి నుంచీ బిజెపిని తన సిద్ధాంత పరమైన ప్రత్యర్థిగా పేర్కొన్నందున, వారి మద్దతు తీసుకునే అవకాశం దాదాపు లేదు. ప్రస్తుతానికి విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. గవర్నర్ ఆయనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తే, ఆయన ఈ చిన్న పార్టీల మద్దతుతో లేదా స్వతంత్రుల సహకారంతో అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. విజయ్ ఒక పూర్తి స్థాయి కూటమిని ఏర్పాటు చేస్తారా లేక కేవలం బయటి నుండి మద్దతు తీసుకుంటారా అన్నది రానున్న రెండు రోజుల్లో తేలనుంది.

