Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

భయ గోదావరి జిల్లాలో ఓ పెద్దపులి స్థానికులను హడలెత్తిస్తోంది. గత నాలుగు నెలలుగా ఈ పెద్ద పులి సంచారం ఉన్నట్టు నిర్ధారించుకున్న అటవీ శాఖ అధికారులు ఆ పులి జాడను తెలుసుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
అయినప్పటికీ దాన్ని బంధించలేకపోతున్నారు. దీంతో ఈ పులి ఏ క్షణంలో దాడి చేస్తోందన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు.

ఇటీవల రాత్రి వేళల్లో పశువులపై దాడి చేస్తూ పోలవరం జిల్లాలో తిరుగుతూ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు రాజమహేంద్రవరం అటవీ పరిధిలో సంచరించిన పెద్దపులి.. మళ్లీ గంగవరం మండలంలోకి ప్రవేశించింది. పులి సంచారంతో ఆయా గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు.

శుక్రవారం ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్, ఆర్డీపురం పరిసరాల్లో సంచరించింది. గతంలో పులిని బంధించినపుడు పులి మెడకు రేడియో కాలర్ పరికరాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో పులి ఎక్కడుందనే ఖచ్చిత వివరాలను తెలుసుకుంటున్నారు.

పోలవరం జిల్లాలోని వేములోవ, పిడతమామిడి, రాములుదేవపురం, వడ్డిచెరువు గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు పర్యటించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. నాలుగు నెలల్లో 20 పశువులపై పెద్దపులి దాడి చేసిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో ప్రజలు ఒంటరిగా అడవి వైపు వెళ్లవద్దని డీఎఫ్‌వో సూచించారు.

పశువులను బయటకు వదలొద్దని విజ్ఞప్తి చేశారు. పులి దాడిలో మృతి చెందిన పశువులకు నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఆదేశాలతో ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయని... వీలైనంత త్వరలో పట్టుకుంటామని అధికారులు తెలిపారు. దట్టమైన అడవి కావడం వల్ల పులిని బంధించడం కొంత ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu