Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉమ్మెత్త పువ్వులతో కూర వండుకుని తిని నలుగురి పరిస్థితి విషమం.. ఎక్కడ?

ఉమ్మెత్త పువ్వులతో కూర వండుకుని తిని నలుగురి పరిస్థితి విషమం.. ఎక్కడ?

Datura Flower curry

మ్మెత్త పువ్వులతో కూర ఆరోగ్యానికి చాలా మంచిదని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను చూసి వండుకుని తిన్నారు. అంతే తిన్న కాసేపటికే నలుగురు కుటుంబ సభ్యులు ఆస్పత్రి పాలయ్యారు.
ఈ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది.

ఉమ్మెత్త పువ్వులతో కూర చేసుకుని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నమ్మిన ఒకే కుటుంబానికి చెందిన గంగాభవాని, వీరలక్ష్మి, వీరబ్బు, జయలక్ష్మి అనే నలుగురు... నిన్న ఆ కూర వండుకుని తిన్నారు. తిన్న వెంటనే అస్వస్థతకు గురైన ఆ నలుగురిని స్థానికులు వారిని వెంటనే కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అమ్మవారి జాతర కోసం హైదరాబాద్ నుండి సొంత ఊరికి వచ్చిన ఈ కుటుంబం, ఇలాంటి చిన్న పొరపాటుతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం స్థానికులను కలచివేస్తోంది. ఏవైనా ఆరోగ్య చిట్కాలు పాటించే ముందు అవి వాస్తవమో కాదో సరిచూసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu