Dailyhunt
Vaishakh Purnima 2026: వైశాఖ పౌర్ణమి: చంద్రుడు, శ్రీలక్ష్మి పూజతో సర్వం శుభం

Vaishakh Purnima 2026: వైశాఖ పౌర్ణమి: చంద్రుడు, శ్రీలక్ష్మి పూజతో సర్వం శుభం

Vaishakh Purnima 2026

వైశాఖ పౌర్ణమి మే 1న జరుపుకుంటారు. ఈ పౌర్ణమి రోజున చంద్రుడు తన పదహారు కళలతో సంపూర్ణ తేజస్సుతో ప్రకాశిస్తాడు. ఈ పౌర్ణమి తిథి ఏప్రిల్ 30న రాత్రి 9:12 గంటల సమయంలో ప్రారంభమై మే 1వ తేదీ రాత్రి 10:52 గంటల సమయంలో ముగుస్తుంది.

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సుకు కారకుడిగా భావిస్తారు. జాతకంలో చంద్ర దోషం ఉన్నవారు, తరచుగా మానసిక ఒత్తిడి, ఆందోళనలతో బాధపడేవారికి ఈ పౌర్ణమి ఒక వరం. వైశాఖ పౌర్ణమి రాత్రి నిండు చందమామకు అర్ఘ్యం సమర్పించాలి. ఒక పాత్రలో గంగాజలం లేదా స్వచ్ఛమైన నీరు తీసుకుని, అందులో కొద్దిగా పచ్చి పాలు, విరగని బియ్యపు గింజలు (అక్షతలు) వేసి చంద్రునికి జల సమర్పణ చేయాలి. ఇలా చేయడం ద్వారా చంద్ర దోషాలు తొలగిపోతాయి.

ఈ అర్ఘ్యం ఇస్తున్నప్పుడు ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని భక్తితో జపించాలి. దీంతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇంకా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు పౌర్ణమి రాత్రి శ్రీ లక్ష్మీదేవిని పూజించాలి. పూజగదిలో గవ్వలను వుంచి పూజించాలి. పౌర్ణమి రోజున లక్ష్మీపూజతో వృధా ఖర్చులు పూర్తిగా తగ్గిపోయి ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu