Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెల్లింగ్టన్ టెస్ట్‌‍ మ్యాచ్ : 352 పరుగుల ఆధిక్యంలో భారత్

వెల్లింగ్టన్ టెస్ట్‌‍ మ్యాచ్ : 352 పరుగుల ఆధిక్యంలో భారత్

cricket

న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు ఆతిథ్య కివీస్‌పై పై చేయిసాధించింది. ఇప్పటివరకు జరిగిన టీ20, వన్డే మ్యాచ్‌ సిరీస్‌లను కైవసం చేసుకుంది.
ఇపుడు వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో కూడా పైచేయి కనబరిచింది. తొలి టెస్టులో పరుగుల వరద పారించించింది. ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల నష్టానికి 720 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఫలితంగా ఆతిథ్య కివీస్‌పై 352 పరుగుల ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.

భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (136), రిషబ్ పంత్ (128) అద్భుత శతకాలతో కదం తొక్కగా, కెప్టెన్ శుభ్ మన్ గిల్ (98) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. యశస్వి జైస్వాల్ (85), దేవదత్ పడిక్కల్ (80), ధ్రువ్ జురెల్ (78) అర్ధ శతకాలతో రాణించారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ టామ్ లాథమ్ (0) ఖాతా తెరవకుండానే జస్రీత్ బుమ్రా బౌలింగ్ వికెట్ కీపర్ పంచ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Telugu