V.N. Aditya, Saranya-Sudheeksha, Chalapathi Kumar, Ali and others
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద 'మన డాక్టర్ బాబే' అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు.వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ .. ''మన డాక్టర్ బాబే' టీజర్ ఆద్యంతం వినోదభరితంగా ఉంది. ఇలాంటి మంచి కామెడీ సినిమాలు రావాలి. టైటిల్‌లో డాక్టర్, మన అని పదాలు అంటే కచ్చితంగా హిట్ అవుతుంటాయి. ఇలాంటి ప్రాజెక్టులకు తోడుగా నిలబడిన అలీ, రాజీవ్ కనకాల కి థాంక్స్. ఏవీఎస్ కూతురు శాంతి మళ్లీ కం బ్యాక్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
శ్రీ స్కంద మాట్లాడుతూ, . టీజర్ చూసి కేవలం యూత్ సినిమా అని అనుకోకండి. ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ. క్లైమాక్స్ వరకు నవ్వుతూనే ఉంటారు. ఈవీవీ గారు, జంధ్యాల గారి సినిమాల్ని చూసినట్టుగా ఉంటుంది. ఈ మూవీకి హీరో కథ. నేను ఓ ఆర్టిస్ట్‌ని మాత్రమే. ప్రతీ ఫ్యామిలీ ఈ చిత్రానికి కనెక్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను ఈ చిత్రాన్ని చూశాను. మంచి సినిమా చేశాను అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మనోజ్ గారి మ్యూజిక్ అందరినీ కదిలిస్తుంది' అని అన్నారు.
నటుడు అలీ మాట్లాడుతూ .. ''మన డాక్టర్ బాబే' సినిమాలో స్కంద చాలా చక్కగా నటించారు. చలపతి అందరి నుంచి మంచి నటనను రాబట్టుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఈ బ్యానర్‌కు మంచి సక్సెస్ రావాలి. కొత్తగా వచ్చే వారికి హిట్లు వస్తే.. మళ్లీ మళ్లీ సినిమాలు తీస్తుంటారు. ఓ సినిమా వల్ల ఎన్నో కుటుంబాలు బతుకుతుంటాయి. చిన్న సినిమాల్ని ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
దర్శకుడు చలపతి కుమార్ మాట్లాడుతూ, ఆర్కే రైటర్ ఈ కథను చాలా బాగా డెవలప్ చేశారు. ప్రతీ సీన్‌కు ఆడియెన్స్ కచ్చితంగా నవ్వుతారు. ఇలాంటి కాన్సెప్ట్‌కి ఓ చిన్న లేయర్ ఉంటుంది. ఆ లేయర్‌ను దాటలేదు. ఫక్తు ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది. చివరకు థియేటర్ నుంచి కన్నీటి చెమ్మతో బయటకు వెళ్తారు. మా మూవీకి మీడియా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అలీ గారు, రాజీవ్ కనకాల, ఇతర ఆర్టిస్టులందరికీ థాంక్స్' అని అన్నారు.
నిర్మాత కృతాక్షి మాట్లాడుతూ .. ''మన డాక్టర్ బాబే' టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా సినిమాకి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
విశ్వ కార్తికేయ మాట్లాడుతూ .. ''చలపతి గారు నన్ను సోలో హీరోగా లాంచ్ చేశారు. 'మన డాక్టర్ బాబే' కథ నాకు తెలుసు. ఈ చిత్రం ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. ఈ మూవీ వంద శాతం పెద్ద హిట్ అవ్వాలి. ఆ తరువాత చలపతి, నేను చేసే సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి' అని అన్నారు.
నటుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ .. ''మన డాక్టర్ బాబే' టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. చాలా గ్యాప్ తరువాత ఓ మంచి పాత్రను చేశానని నాకు అనిపిస్తోంది. ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్' అని అన్నారు.

