పాట్నాలో దారుణమైన దృశ్యం కనిపించింది. ఓ యువతిని హత్య చేసి చెత్త పక్కనే పడేశారు. ఆ దృశ్యం హృదయ విదారకంగా వుంది. మానవత్వాన్ని హత్య చేసి ఒక చెత్త కుప్పలో పడేశారు.
పునైచక్ రోడ్ నెం.3లో దారుణమైన గాయాలతో నిండిన ఒక మహిళ మృతదేహం కనిపించింది. మహిళ మృతదేహం రోడ్డు వెంట చెత్త పక్కనే పడి వుండటంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు.
ఈ దారణం చూసినప్పుడు మనుషుల్లో దాగి ఉన్న సంపూర్ణ అరాచకత్వానికి, క్రూరత్వానికి ఒక భయంకరమైన అద్దంలా గోచరిస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఫోరెన్సిక్ బృందం, శునక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ ఈ దారుణానికి పాల్పడిన రాక్షసులు ఇప్పుడే కటకటాలలో వుండాలనీ, వారికి మరణశిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

