Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
HIMAJAL WATER SOLUTIONS : నీటి సంరక్షణే లక్ష్యంగా హిమజల్ కొత్త ఉత్పత్తులు

హైదరాబాద్‌ : నీటి వృథాను తగ్గించి, సమర్థవంతమైన నీటి నిర్వహణను ప్రోత్సహించే లక్ష్యంతో డివ్యాంక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన హిమజల్ వాటర్ సొల్యూషన్స్ మూడు నూతన ఉత్పత్తులను ఆవిష్కరించింది. సంస్థ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ ఆనంద్ కుమార్ జైన్ ఈ ఉత్పత్తులను పరిచయం చేశారు.

రివర్స్ ఆస్మోసిస్ శుద్ధి ప్రక్రియలో నీటి పునరుద్ధరణను మెరుగుపరిచేందుకు హిమజల్ డెల్టా, కఠిన జలాల వల్ల ఏర్పడే ఖనిజ పొరల సమస్యలను నియంత్రించేందుకు హిమజల్ స్కేల్‌అవుట్, నీటి మృదీకరణ వ్యవస్థల నిర్వహణను సులభతరం చేసేందుకు హిమజల్ స్మార్ట్ సాఫ్టెనర్ ఉత్పత్తులను రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది.
అనుకూలమైన నీటి నాణ్యత, నిర్వహణ పరిస్థితుల్లో హిమజల్ డెల్టా ద్వారా 60 శాతం వరకు నీటి పునరుద్ధరణ సాధ్యమవుతుందని తెలిపింది.

ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ కుమార్ జైన్ మాట్లాడుతూ, నీటిని శుద్ధి చేయడంతోపాటు దాని వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, నిర్వహణ ఖర్చులను తగ్గించడం, నీటి వనరులను బాధ్యతాయుతంగా వినియోగించడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రతి ప్రాంతంలో నీటి నాణ్యత భిన్నంగా ఉంటుందని, నీటిని పరీక్షించి అవసరాలకు తగిన సాంకేతికతను ఎంచుకోవాలని సూచించారు.

గృహాలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు ఆధునిక నీటి శుద్ధి పరిష్కారాలను అందిస్తున్న హిమజల్.. నీటి సంరక్షణ, సాంకేతిక ఆవిష్కరణలు, సమర్థవంతమైన నీటి నిర్వహణకు ప్రాధాన్యమిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: TNN News - Telugu News Network