Friday, 27 Nov, 12.17 pm Zee News తెలుగు

తాజా వార్తలు
CBSE Single Girl Child Scholarship 2020: ఇలా చేస్తే ఆ విద్యార్థులకు ప్రతినెలా డబ్బులు!

పదో తరగతి పాసయ్యారా. అందులోనూ మీరు సింగిల్ గర్ల్ చైల్డ్‌గా ఉన్నారా. అయితే ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం ప్రత్యేకమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఈ స్కీమ్ పేరు సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్. అమ్మాయిలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ సదుపాయాన్ని కల్పించింది. ఇందులో దరఖాస్తు చేసుకుంటే పదో తరగతి పాస్ అయిన అమ్మాయిలకు ప్రతినెలా కొంత నగదు స్కాలర్‌షిప్ (CBSE Single Girl Child Scholarship 2020) అందనుంది.

  • Also Read : Oppo Price Cut on Smartphones: ఆకర్షణీయమైన ధరలకే ఒప్పో స్మార్ట్‌ఫోన్లు


సీబీఎస్ఈ అందిస్తున్న స్కాలర్‌షిప్‌ (Single Girl Child Scholarship 2020)లో భాగంగా రూ.500 మేర ప్రతినెలా చేతికి వస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలలో టెన్త్ క్లాస్ చదివి ఉత్తీర్ణత సాధించిన బాలికలు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడే పదో తరగతి పాస్ అయిన CBSE విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పాత విద్యార్థులు తమ స్కాలర్‌షిప్ రెన్యూవల్ చేసుకోవచ్చు.

అప్లై చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

సీబీఎస్ఈలో చదివి పదో తరగతి పరీక్షల్లో60 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణత సాధించిన సింగిల్ గర్ల్ చైల్డ్‌ను అర్హులుగా భావిస్తారు. అదే విధంగా 11వ తరగతి, 12వ తరగతులను సైతం సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో చదువుకుంటున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 28వరకు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  • Also Read : Twitter Blue Ticks: ట్విట్టర్‌లో బ్లూ టిక్ వీరికి మాత్రమే.. ఎవరికో తెలుసా?
  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Zee News Telugu
Top