Singer Madhupriya: తెలంగాణ జానపద కళాకారిణి, ప్రముఖ సింగర్ మధుప్రియ రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న ఆమె, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనకున్న వీరాభిమానాన్ని చాటుకున్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.
జగిత్యాలలో నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో మధుప్రియ తన గాత్రంతో ప్రజలను ఉర్రూతలూగించారు. ఉద్యమ కాలం నాటి పాటలతో పాటు కేసీఆర్ నాయకత్వాన్ని కీర్తిస్తూ ఆమె పాడిన పాటలు సభలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. “మళ్లీ బాపు రావాలి.. మన కేసీఆర్ పాలన రావాలి” అంటూ ఆమె చేసిన నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఒక భావోద్వేగమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Read Also: Kavitha comments: బీజేపీపై కేసీఆర్ మౌనం వెనుక అర్థమేమిటి?
Singer Madhupriya creates a stir at KCR’s public meeting
Singer Madhupriya: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మధుప్రియ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల కష్టాలు మొదలయ్యాయని, కూల్చివేతల పర్వం పెరిగిపోయిందని ఆమె ఆరోపించారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ సుభిక్షంగా ఉందని, మళ్లీ ఆయన ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
రాజకీయంగా తన స్టాండ్ ఏంటో మధుప్రియ అత్యంత స్పష్టంగా చెప్పారు. “నేను ఎప్పుడూ కేసీఆర్ పక్షమే ఉంటాను. రేవంత్ రెడ్డి అడిగినా సరే, నేను వారి కోసం పాటలు పాడను” అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ఉద్యమ కాలం నుండి కేసీఆర్‌తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని, ఆ కృతజ్ఞతతోనే తాను బీఆర్ఎస్ వెంటే నడుస్తానని ఆమె స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

