Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలకు తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టారు. ముఖ్యంగా మలయాళ భాషను ఆమె తక్కువ చేసి మాట్లాడిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
తన వ్యాఖ్యలను మీడియాలో వక్రీకరించడం వల్లే ఈ అపోహలు తలెత్తాయని ఆమె స్పష్టం చేశారు.
Read Also: NTR Prashanth Neel Movie Release Date: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
Actress Sai Pallavi responds to language controversy!
Sai Pallavi: అపోహలను తొలగించిన నటి
తాను ఏ భాషను ఎప్పుడూ చిన్నచూపు చూడలేదని సాయి పల్లవి స్పష్టం చేశారు. గతంలో జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో తాను కేవలం తన మాతృభాష తమిళమని మాత్రమే చెప్పానని, అది తన స్వగ్రామం, మూలాలకు సంబంధించిన మాట మాత్రమేనని వివరించారు. కానీ ఆ మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని, తాను ఇతర భాషలను ముఖ్యంగా తనను ఆదరించిన మలయాళ భాషను ద్వేషిస్తున్నట్లుగా ప్రచారం చేయడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.
అన్ని భాషల పట్ల గౌరవం
నటిగా తనకు అన్ని భాషలు సమానమేనని, కళాకారిణిగా భాషా భేదం లేకుండా ప్రతి పరిశ్రమను తాను గౌరవిస్తానని సాయి పల్లవి తెలిపారు. తన మాటలను వక్రీకరించి అపోహలు సృష్టించడం వల్ల తన అభిమానులు, సినిమా వర్గాల్లో తప్పుడు సంకేతాలు వెళ్లడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తప్పుడు ప్రచారం వల్లే ఇలాంటి వివాదాలు తలెత్తుతున్నాయని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి ద్వేషం లేదని ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

