Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు డబుల్ హెడ్డర్.. పంజాబ్‌పై గుజరాత్ రివేంజ్ తీర్చుకుంటుందా?

నేడు డబుల్ హెడ్డర్.. పంజాబ్‌పై గుజరాత్ రివేంజ్ తీర్చుకుంటుందా?

వార్త 5 months ago

GT vs PBKS: ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్, ఇప్పుడు తమ సొంత గడ్డ అహ్మదాబాద్‌లో దానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

ఆనాడు ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పుడు అదే జోరును అడ్డుకోవాలని శుభ్‌మన్ గిల్ సేన పట్టుదలతో ఉంది.

Read Also:Tilak Varma: మైదానంలో తిలక్ వర్మకు గాయం.. బంతి తగిలి ఎగిరిపడ్డ ఖరీదైన వాచ్

రివేంజ్ తీర్చుకునే తరుణం

పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో ఆకాశమే హద్దుగా రాణిస్తోంది.13 పాయింట్లతో (+1.043 రన్ రేట్) అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, గుజరాత్ 9 మ్యాచ్‌లలో 5 గెలిచి 10 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ భారీ తేడాతో గెలిస్తే, రాజస్థాన్‌ను వెనక్కి నెట్టి టాప్ 4లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది.

 GT vs PBKS IPL 2026 Prediction Ahmedabad

గణాంకాల ప్రకారం చూస్తే పంజాబ్ కింగ్స్‌దే పైచేయిగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు జరగగా.. పంజాబ్ 4 గెలిచింది, గుజరాత్ 3 మ్యాచ్‌లలో విజయం సాధించింది. పంజాబ్ బ్యాటర్ల ఫామ్ చూస్తుంటే గుజరాత్ బౌలర్లకు గట్టి సవాలే ఎదురుకానుంది.

GT vs PBKS: మ్యాచ్ వివరాలు

  • వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్.
  • సమయం: రాత్రి 7:30 గంటలకు.
  • లైవ్ స్ట్రీమింగ్: స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా (జియో హాట్ స్టార్).

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నేడు ఉప్పల్‌లో ఆరెంజ్ పండుగ.. KKRతో సన్‌రైజర్స్ అమీతుమీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha