Dailyhunt
నేడు ఉప్పల్‌లో ఆరెంజ్ పండుగ.. KKRతో సన్‌రైజర్స్ అమీతుమీ

నేడు ఉప్పల్‌లో ఆరెంజ్ పండుగ.. KKRతో సన్‌రైజర్స్ అమీతుమీ

వార్త 1 week ago

SRH vs KKR IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. నేడు మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో SRH తలపడనుంది.

ఈ సీజన్ లో ఇప్పటికే 9 మ్యాచ్ లలో 6 విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్, వరుసగా (డబుల్ హ్యాట్రిక్) నమోదు చేయాలని పట్టుదలతో ఉంది.

Read Also:CSK vs MI: చెపాక్‌లో ముంబై చిత్తు.. CSK హిస్టారికల్ విక్టరీ

SRH vs KKR IPL 2026: విధ్వంసకర బ్యాటింగ్ లైనప్

SRH జట్టులో ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. మిడిలార్డర్ లో హెన్రిచ్ క్లాసెన్ తన హార్డ్ హిట్టింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. సొంత గడ్డపై ఆడుతుండటం, ఇప్పటికే KKRపై ఈ సీజన్ లో ఒక విజయం సాధించి ఉండటం ఆరెంజ్ ఆర్మీకి కొండంత బలాన్ని ఇస్తోంది.

 SRH vs KKR

KKR దయనీయ పరిస్థితి

మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ సీజన్ లో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఆడిన 8 మ్యాచ్ లలో కేవలం 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. SRH వంటి ఫామ్ లో ఉన్న జట్టును వారి సొంత గడ్డపై ఢీకొట్టడం KKRకు పెద్ద సవాలే. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కోల్‌కతా జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha