తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సెగ మొదలైంది. ప్రభుత్వ కమిటీతో జేఏసీ (JAC) జరిపిన చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో, ఆర్టీసీ కార్మికులు అర్ధరాత్రి నుంచే సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఏర్పడింది. ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే, కార్మికులు కోరుతున్న డిమాండ్ల పరిష్కారానికి కమిటీ నాలుగు వారాల సమయం కోరింది. దీనికి జేఏసీ ససేమిరా అనడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ, కార్మిక సంఘాలు సమ్మె నిర్ణయానికే మొగ్గు చూపాయి. విద్యా సంస్థలు, వ్యాపార కార్యకలాపాలు సాగే సమయంలో బస్సులు నిలిచిపోవడం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
Read Also : TGPSC Recruitment: TGPSC అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే!

ప్రధాన డిమాండ్లు – కార్మికుల పట్టుబదలని పోరు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్లో ఉన్న వేతన సవరణ (Pay Revision) అమలు చేయడం కార్మికుల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. వీటితో పాటు పని ఒత్తిడి తగ్గించడం, ఇతర సౌకర్యాల కల్పనపై వారు పట్టుబడుతున్నారు. ఈ సమస్యలు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్నాయని, తక్షణ హామీ లభిస్తే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని జేఏసీ స్పష్టం చేసింది. డిపోల వద్ద ఇప్పటికే నిరసన సెగలు మొదలయ్యాయి.
ప్రయాణికులకు ఇబ్బందులు – ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని RTOలకు రవాణాశాఖ ఆదేశించింది. ప్రైవేటు డ్రైవర్లు, వాహనాల వివరాలు సేకరించి, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది. GHMCలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేటు వాహనాలను అందుబాటులో ఉంచాలని చెప్పింది. మానిటరింగ్ అధికారులను నియమించనుంది.
సడన్ గా బస్సులు బంద్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే వారు, రోజువారీ కూలీలు, విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకులాడాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్లు లేదా ఇతర వాహనాల ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, భారీ సంఖ్యలో ఉన్న బస్సు సర్వీసులను భర్తీ చేయడం సవాలుగా మారింది. పోలీసులు కూడా డిపోల వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

