Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TGPSC అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే!

TGPSC అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే!

వార్త 6 months ago

TGPSC Recruitment: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న 20 అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2) పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషన్ కోరింది. ప్రభుత్వ కొలువు సాధించాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం.

Reada also: AP Summer Holidays: విద్యార్థుల భద్రతపై ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం

TGPSC Assistant Scientist Job Notification

TGPSC Recruitment: అధికారిక వెబ్‌సైట్ సమాచారం

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 25వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి మరియు ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ను సందర్శించి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దరఖాస్తు తేదీల వివరాలు

కాలుష్య నియంత్రణ మండలిలో పారదర్శకంగా నియామకాలు చేపట్టేందుకు టీజీపీఎస్‌సీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులకు ఎంపికైన వారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాలలో పని చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో సూచించిన నిబంధనల ప్రకారం పరీక్షలు లేదా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.

TGPSC Assistant Scientist Job Notification

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఇంటర్ విద్యలో కీలక మార్పు.. ఎంఈసీ స్థానంలో కొత్త కోర్సు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha