Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?

బిడ్డ పుట్టకముందే వస్తువులు కొనొద్దు: మూఢనమ్మకమా, ఆరోగ్య జాగ్రత్తా?

ABP దేశం 1 month ago

బిడ్డ ఇంకా భూమ్మీద పడకముందే తనకోసం భారీగా ప్లాన్లు వేసుకోవడం, ఏవైనా కొనిపెట్టడం లాంటివి చేయొద్దని పెద్దలు చెబుతుంటారు. ఇది మూఢ నమ్మకమా? జీవిత అనుభవం నుంచి వచ్చిన జాగ్రత్తా?...

ఆధ్యాత్మిక కారణాలేంటి, సైన్స్ ఏం చెబుతోంది...తెలుసుకుందాం..

పుట్టబోయే బిడ్డ కోసం దస్తులు, చిన్న చిన్న బొమ్మలు కొనుగోలు చేసి పెట్టి వాటిని చూసి సంతోష పడడం సహజం. కానీ ఇంట్లో ఉండే పెద్దలు ఇలా కొనుగోలు చేయకూడదు అని చెబుతుంటారు. అదంతా మూఢనమ్మకం అని కొట్టిపడేస్తుంటారు..కానీ..దానివెనుక కారణాలున్నాయని మీకు తెలుసా?

ఆధ్యాత్మిక కారణాలు

మన హిందూ సంస్కృతిలో గర్భందాల్చడం పవిత్రమైన దశ. గర్భసంస్కారం అనేది బిడ్డ మనసు, శరీరం ఆరోగ్యంగా ఉండాలని చేసే ప్రక్రియ. వేదాలు, ఆయుర్వేదం ప్రకారం తల్లి ఆలోచనలు, భావాలు, చుట్టుపక్కల వాతావరణ ప్రభావం లోపలున్న బిడ్డపై ఉంటుంది. అందుకే బిడ్డ పుట్టకముందే ఎక్కువగా ఆలోచించడం, వారికోసం అన్నీ కొనుగోలు చేసి పెట్టడం ద్వారా వారిపై చెడు దృష్టి పడే అవకాశం ఉందంటారు ఆధ్యాత్మికవేత్తలు.

బిడ్డ ఇంకా బయటపడకముందే..వారికి సంబంధించిన వస్తువులు కొని ఇంట్లో వినియోగించకుండా పెడితే వాటిపై దుష్టశక్తుల ప్రభావం ఉంటుందని చెబుతారు. బయటప్రపంచం నుంచి వచ్చే ఈర్ష్య, అసూయలు లోపలున్న చిన్నారిపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. పైగా.. రాబోయే జీవితం గురించి అతిగా ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించాలనే సందేశం కూడా ఇందులో ఉంది.

ధ్యానం, శ్లోకాలు చదువుకోవడం, సాత్విక ఆహారం, మంచి వాతావరణంలో ప్రశాంతంగా ఉండడం..ఇవన్నీ లోపలున్న బిడ్డకు మంచి సంస్కారం అందించేందుకు ఉపయోగపడతాయి. పిల్లలు.. భగవంతుడు ప్రసాదించే వరం. ఆ బహుమతి మీ కళ్లముందుకి వచ్చిన తర్వాతే మీ సొంతం అవుతుంది..అతి ఆతురత కారణంగా కొత్త సమస్యలు వస్తాయని హెచ్చరిస్తారు ఆధ్యాత్మికవేత్తలు.

సైన్స్ దృక్పథంలో చూస్తే..

అప్పట్లో పసిపిల్లల మరణాలు ఎక్కువ. వైద్య సౌకర్యాలు తక్కువగా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో ఎక్కువ మంది సంతానం ఉండడం వెనుక ఇది కూడా ఓ కారణం అని చెబుతారు ఆరోగ్య నిపుణులు. అయితే.. ఆధునిక వైద్యం కూడా బిడ్డ పుట్టకముందే వారికోసం ఏమీ కొనుగోలు చేయొద్దని చెబుతోంది. మొదటి మూడు నెలలు గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువ. ఆ తర్వాత కూడా ప్రసవంలోగా ఎలాంటి సమస్యలు వస్తాయో ఊహించలేం. పిల్లల కోసం ముందే బొమ్మలు, రూమ్ సహా అన్నీ సిద్ధం చేసి పెడితే..ఏదైనా జరగకూడనిది జరిగితే ఆందోళన పెరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం గర్భిణి స్త్రీ ప్రశాంతంగా ఉండాలి.. అతి ఆలోచనల, ఆందోళన రెండూ మంచివి కాదు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి కానీ.. వారికి కొనుగోలు చేయాల్సిన వస్తువులపై కాదంటారు ఆయుర్వేద నిపుణులు. స్ట్రైస్ హార్మోన్లు పెరిగితే బిడ్డ పెరుగుదలపై ప్రభావం పడుతుంది.

ఇది మూఢ నమ్మకమా అంటే కాదు..కేవలం జాగ్రత్త మాత్రమే అని చెబతారు పెద్దలు. వాస్తవానికి పసిపిల్లలకు కొత్త దుస్తులు వేయరు..అప్పటికే ఇంట్లో ఉండే చిన్నారుల దుస్తులు ఏమైనా వేస్తారు..ఇలా చేస్తే బిడ్డ ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం. ఆరోగ్యపరంగా ఆలోచిస్తే.. నూతన వస్త్రాల్లో రసాయనాలు చిన్నారి ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. ఏదైమైనా ...ఈ జాగ్రత్తలన్నీ తల్లి-బిడ్డ రక్షణకోసమే కానీ మూఢనమ్మకం కాదు. అతిగా భయపడొద్దు, అనవసర ఒత్తిడి తీసుకోవద్దు.. మంత్రాలు వినండి, సంగీతాన్ని ఆస్వాదించండి, సాత్విక ఆహారం తీసుకోండి, యోగా చేయండి..ఇవే మీరు మీకు పుట్టబోయే బిడ్డకు ఇచ్చే అది పెద్ద బహుమతులు అని సూచిస్తున్నారు ఆధ్యాత్మికవేత్తలు.

పిల్లలకు అద్దం ఎందుకు చూపించకూడదు? సైన్స్, ఆధ్యాత్మికం, ఆరోగ్య రహస్యం!

Author : RAMA

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam