Hindu Dharma: బొట్టు పెట్టుకోకుండా ఉన్నా హిందువేనా? జీన్స్ టీషర్ట్స్ తో ఆలయాలకు వెళితే భక్తి లేనట్టేనా? హిందూ ధర్మం బాహ్య ఆచారాలకు సంబంధించిందా లేదంటే మనసు, గుణాలుకు సంబంధించిందా?
ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో ఎన్నో.. వాటికి ఆధ్యాత్మికవేత్తలు, పండితులు ఇచ్చే సమాధానాలెన్నో.
భగవద్గీత" href="https://telugu.abplive.com/search?s=%E0%B0%AD%E0%B0%97%E0%B0%B5%E0%B0%A6%E0%B1%8D%E0%B0%97%E0%B1%80%E0%B0%A4" target="_self">భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినట్టు "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన"...నీ కర్మ చేయడం నీ ధర్మం..ఫలితంపై ఆశపడొద్దు. ఇక్కడ ధర్మం అంటే ధరించే దుస్తులు కాదు సత్యం, శాంతి, అహింస వంటి గుణాల్లో వ్యక్తమవుతుంది. శ్రీ రామకృష్ణ పరమహంస తన జీవితంలో బాహ్య ఆడంబారను తృణీకరించారు. సాధారణ దుస్తుల్లోనే భగవంతుడిని సాక్షాత్కారం చేసుకున్నారు. ఆయన శిష్యుడు స్వామి వివేకానంద కూడా బాహ్య రూపాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆధ్యాత్మికతను ఆంతరంగిక బలం, సేవ, జ్ఞానంతో ముడిపెట్టారు.
మనిషి బాహ్యరూపం చూసి తీర్పు చెప్పకూడదు..హృదయం చూడాలి అని ఆధ్యాత్మిక గ్రంథాలు బోధిస్తాయి
హిందూ ధర్మంలో హిందూ అనే మతం లేదు..సనాతన ధర్మం ఉంది. సనాతనం అంటే ఎప్పటికీ నిలిచేది
భగవద్గీతతో కృష్ణుడు నీ ధర్మం క్షత్రియ ధర్మం అన్నాడు.. యుద్ధం చేయడం అని చెప్పాడు కానీ దుస్తుల గురించి చెప్పలేదు
మనుస్మృతి" href="https://telugu.abplive.com/spirituality/why-you-should-not-criticize-the-dead-in-hindu-scriptures-know-in-telugu-233200" target="_self">మనుస్మృతి ధర్మ లక్షణాలు 10 చెప్పింది - ధైర్యం, క్షమ, దమం, సత్యం..ఇందులోనూ దుస్తుల ప్రస్తావన లేదు
రుషులు అడవిలో నారదుస్తులు ధరించారు, రాజులు పట్టు పంచెలు కట్టుకున్నారు, కృష్ణుడు పీతాంబరం ధరించాడు.. దుస్తులు అనేవి దేశం, వృత్తిని బట్టి మారుతాయి కానీ ధర్మం మారదు.
కాశీలో మరణం మోక్షం ఎందుకు? మరణించిన వ్యక్తి చెవిలో శివుడు చెప్పే ఆ మంత్రం రహస్యం ఏంటి?
కట్టు, బొట్టు, ధోతి ఇవన్నీ ఎందుకొచ్చాయ్?
ఇవన్నీ ధర్మానికి గుర్తులు..అంటే ఓ ఇంటికి అడ్రస్ లా సనాతన ధర్మం పాటించేవారు అనుసరించే నియమాలు. పైగా ఇవన్నీ కేవలం ఆధ్యాత్మికతో కాదు శాస్త్రీయ కారణాలూ ఉన్నాయ్.
రెండు కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం...కుంకుమ, గంధం, తిలకం పెట్టుకోవడం వల్ల యాక్టివేట్ అవుతుంది. ఏకాగ్రత, ప్రశాంతత కుదురుతుంది
నడుము నుంచి చీలమండల వరకూ ధరించే ధోతీ మూలాధార చక్రానికి రక్షణ. కుట్టులేని వస్త్రం విద్యుత్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అదే ధరించకపోతే పాపం కాదు కానీ పూజలో కూర్చునేటప్పుడు కుట్టిన వస్త్రాలు వద్దని చెబుతారు
మెడలో ధరించే మాలల తాకిడికి రక్తపోటు బ్యాలెన్స్ అవుతుంది. ఇవి కూడా తాను ఎవరి భక్తుడో చెప్పేందుకు ఐడీ కార్డ్స్ లాంటివి..రుద్రాక్ష ధరిస్తే శివభక్తుడు, తులసిమాలలు ధరిస్తే కృష్ణ భక్తుడు ఇలా...
బ్రాహ్మణుడు అయితే జంథ్యం, శిఖ ఈ రెండూ విధి కాదు విధానాలు. చేస్తే మంచిది చేయకపోతే నరకం అని శాస్త్రంలో ఎక్కడా లేదు. తలపై వేసే వెంట్రుకల ముడి ద్వారా మెదడులో వేడి బయటకు పోతుంది.
ఎక్కడ చూసినా దుస్తుల గురించే చర్చ..సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే హిందువా? అని అడిగితే..ఇందుకు 3 కారణాలు చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు.
మనుస్మృతి ప్రకారం.. "ఎక్కడి ఆచారం అక్కడే". 500 ఏళ్ల క్రితం పంచె ధర్మం, ప్రస్తుతం ఉద్యోగాలు చేసేవారికి వారి కార్యాలయ నిబంధనల ప్రకారం దుస్తులు వేసుకోవాలి, డాక్టర్ ఏప్రాన్, ఇంజినీర్ హెల్మెట్ పెట్టుకున్నట్టు. బట్టలు లేవు, బొట్టు లేదు కానీ ఏనుగు మొరపెట్టుకోగానే శ్రీ మహావిష్ణువు పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. అంటే దుస్తులకు లేని విలువ భక్తికి ఉంటుంది. అంతరంగ శుద్ధి ముఖ్యం బాహ్యం కాదని ఉపనిషత్తులు చెప్పాయ్. లోపల లోభం, క్రోధం, మోసం ఉంచుకుని వేషధారణ సంప్రదాయంగా ఉంటే అది ధర్మాన్ని పాటించడం అవుతుందా?
అసలైన హిందువు ఎవరు?
నేను చేసే ప్రతి పనికి నేనే బాధ్యుడిని..దేవుడు నన్ను కాపాడుతాడు కానీ నా పాపాలకు శిక్షవేయకుండా తప్పించడు అని నమ్మేవారు ధర్మాన్ని పాటిస్తున్నట్టే. నా దేవుడు గొప్ప నీ దేవుడు తక్కువ అని విమర్శించకుండా.. "ఏకం సత్ విప్రా బహుధా వదంతి" అని చెప్పేవారు హిందువులే
. పంచ మహాయజ్ఞాలు- తల్లిదండ్రులకు, అతిథికి, జీవాలకు, పితృదేవతలకు, దేవుడికి...ఈ ఐదుగురికి ఏదో రూపంలో సహాయం చేసేవారు ధర్మాన్ని పాటిస్తున్నట్టే. ఈ 3 ధర్మాలు పాటించకుండా నుదుట కుంకుమ, సంప్రదాయ వస్త్రధారణ చేస్తే నువ్వు వేషధారివి మాత్రమే అవుతావ్ అంటోంది శాస్త్రం.
సదాచారం అంటే నీ వృత్తికి, కాలానికి తగ్గట్టు దుస్తులు ధరించి..మనసులో సత్యవంతుడిగా ఉండడం
వేషాచారం అంటే బయటకు హిందువులా కనిపిస్తూ లోపల అధర్మంగా బతకడం
మీరు ధరించే దుస్తులు కాదు..మీ ప్రవర్తన, మీరు పాటించే ధర్మం మీరు ఎవరో చెబుతుంది. ధర్మం దుస్తుల్లో లేదు మీ నడవడిలో ఉంది. అంటే సంప్రదాయ దుస్తులు ధరించమని చెప్పడం పాపమా అనే వితండవాదం వద్దు. హిందూ ధర్మంలో దుస్తులు ఒక ప్రతీక మాత్రమే. పూజా సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించడం ఏకాగ్రతను పెంచుతుంది. బాహ్యంగా ఎన్ని తీర్థయాత్రలు చేసినా , సంప్రదాయ దుస్తులు ధరించినా మనసులో కోపం, ద్వేషం, అసూయ, అసత్యం ఉంటే అది నిజమైన ధర్మం కాదు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
Author : RAMA

