Dailyhunt
kalavari kodalu kanaka mahalakshmi serial today April 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల కండీషన్ సీరియస్! ఇద్దరికీ ఒకే సారి ఏమైంది?

kalavari kodalu kanaka mahalakshmi serial today April 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల కండీషన్ సీరియస్! ఇద్దరికీ ఒకే సారి ఏమైంది?

ABP దేశం 4 days ago

Kalavari kodalu kanaka Mahalakshmi serial today episode లక్ష్మీ విహారి గురించి ఆలోచిస్తూ సీమంతం గుర్తు చేసుకుంటుంది. గాజులకు రక్తం అంటింది ఏంటి..

ఏమైంది విహారి గారికి.. ఆయన ఇంకా నన్ను మర్చిపోలేక తాగుతూనే ఉన్నారు.. ఆయనకు ఇలా అవ్వడానికి కారణం నేనే అని బాధ పడుతుంది. ఇంతలో లక్ష్మీ దగ్గరకు బామ్మ వచ్చి నీకు మంచిగా సీమంతం అయింది.. ముత్తయిదువులు కూడా దీవించారు.. నీకు పండంటి బిడ్డ పుడతాడు అని చెప్తుంది. తర్వాత లక్ష్మీకి ట్యాబ్లెట్ వేసుకోమని మందులు తీసుకొస్తుంది.

భుజంగం మనిషి శోభ విషపూరితమైన ట్యాబ్లెట్ ఆ కవర్లో కలిపేసి ఉంటుంది. లక్ష్మీకి ఆ విషయం తెలీక ట్యాబ్లెట్ వేసేస్తుంది. మరోవైపు విహారి కూడా విపరీతంగా తాగుతూ ఉంటాడు. కనకం నన్ను ఎందుకు మోసం చేసి వెళ్లిపోయావ్ అని అనుకుంటూ తాగుతూ ఉంటాడు. ట్యాబ్లెట్ పవర్ వల్ల లక్ష్మీకి కడుపు నొప్పి మొదలవుతుంది. బామ్మ అని లక్ష్మీ అరుస్తుంది. భుజంగం మనుషులు దూరం నుంచి చూస్తుంటారు. బామ్మ వచ్చి అమ్మ సిరి ఏమైంది అని అంటే కడుపులో బాగా నొప్పిగా ఉందని అంటుంది. ఇప్పుడు నొప్పులు ఏంటమ్మా అని బామ్మ కంగారు పడుతుంది. హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా అని లక్ష్మీని బామ్మ తీసుకెళ్తుంది.

Also Read: ఇల్లు ఇల్లాలు పిల్లలు కొత్త క్యారెక్టర్: ముఖాలు మాడ్చేసిన పొట్టి మిరపకాయ్ లవర్స్! ఆ ప్రేమలా ఈ ప్రేమ మెప్పిస్తుందా..! ఇకపై జరిగేది ఇదే!

లక్ష్మీ చాలా ఇబ్బంది పడుతుంది. ఈ టైంలో నొప్పులేంటమ్మా సమయానికి ఎవరూ రావడం లేదు.. ఏం చేయాలి అని బామ్మ చాలా కంగారు పడుతుంది. ఇక విహారి ఓ చోట తాగి పడిపోతాడు. విహారి కోసం యమున వస్తుంటుంది. విహారికి కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. విహారి కోసం వస్తున్న యమున కారుని బామ్మ ఆపుతుంది. ముందు డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. తర్వాత యమున బామ్మని చూసి కారు ఆపి వెనక్కి వస్తుంది. యమున కిందకి దిగడం చూసిన లక్ష్మీ ముసుగు వేసుకుంటుంది. బామ్మ లక్ష్మీతో నా మనవరాలు గర్భవతి ఉన్నట్లుండి నొప్పులు వస్తున్నాయి.. హాస్పిటల్కి తీసుకెళ్తామని అంటుంది. సరే హాస్పిటల్కి తీసుకెళ్దాం అని యమున బామ్మకి సాయం పట్టి లక్ష్మీని కారులో ఎక్కిస్తుంది. దారిలో ఓ చెత్త కుప్ప దగ్గర యమున విహారిని చూస్తుంది.

కలవారి కోడలు కనకమహాలక్ష్మీ అప్కమింగ్: కొన్నేళ్ల తర్వాత అంటూ.. ఆ కథే రిపీట్ అవుతుందా! లక్ష్మీ బిడ్డని విహారికి అప్పగిస్తుందా!

విహారి అంటూ యమున డ్రైవర్ ఇద్దరూ వెళ్లి విహారిని కారులో ఎక్కిస్తారు. ఇలా అయిపోయావ్ ఏంట్రా అని యమున బాధ పడితే డ్రైవర్ యమునతో సార్ ఎక్కుత తాగేశారు.. ఇలా వదిలేస్తే డీ హైడ్రేషన్ అయిపోతుంది. హాస్పిటల్కి తీసుకెళ్తాం అంటాడు. యమున సరే అని లక్ష్మీ పక్కనే విహారిని కూర్చొపెడుతుంది. విహారి లక్ష్మీ భుజం మీద సోయ లేకుండా పడిపోతాడు. బామ్మ విహారిని గుర్తు పట్టి ఈ అబ్బాయి మీ అబ్బాయా అమ్మ అని రౌడీల నుంచి తనని విహారి కాపాడిన విషయం చెప్తుంది. చాలా మంచివాడమ్మా పాపం ఈ తాగుడు అలవాటు ఏంటో ఈ బాబుకి అని అంటుంది. నా కొడుకు ఒకమ్మాయిని ప్రేమించాడు.. తనే జీవితం అనుకున్న ఆ అమ్మాయి దూరం అయిపోవడంతో ఇలా తాగుడుకి బానిస అయిపోయాడు అని ఏడుస్తుంది.

లక్ష్మీ విహారిని చూసి చాలా ఏడుస్తుంది. మనసులో విహారి గారు మీ జీవితం ఇలా అయిపోవడానికి కారణం నేనే నన్ను క్షమించండి అని అనుకుంటుంది. విహారి చేయి పట్టుకుంటుంది. లక్ష్మీ, విహారి ఇద్దరినీ హాస్పిటల్లో చేర్పిస్తారు. ఇద్దరికీ పక్కపక్క బెడ్ల మీదే ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్ బయటకు వచ్చి యమునతో ఇంతలా తాగితే ఎలా అండి మీరు అయినా అడ్డుకోవాలి కదా అని చెప్తుంది. ఇక బామ్మతో మీ మనవరాలు తిన్న ఆహారం విషతుల్యమైంది అని అంటుంది. దానికి బామ్మ అది ఏం తిందో ఏంటో అది అసలు సరిగా తిండే తినదు.. లోపల ఉన్న బిడ్డకి ఏం ప్రమాదం లేదు కదా అని అంటే ఇప్పుడే చెప్పలేం ప్రస్తుతానికి లక్ష్మీ, విహారిల కండీషన్ సీరియస్గానే ఉందని డాక్టర్ చెప్తుంది. యమున విహారి దగ్గరకు వెళ్లి చాలా ఏడుస్తుంది. ఏంట్రా ఇది నీ గురించి అందరూ ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా... నువ్వు భరించలేని బాధ పడుతున్నావ్ అని నాకు తెలుసు కానీ ఎన్నాళ్లు ఇలా రా అని అడుగుతుంది. పక్కనే ఉన్న లక్ష్మీని ఇద్దరూ చూసుకోరు. యమునని పంపేయమని విహారి నర్సుకి సైగ చేస్తాడు. దాంతో నర్సు యమునని వెళ్లిపోమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Author : Jhanshi Balleda

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ABP Desam