స్పెయిన్‌లోని టెనెరిఫ్ నుంచి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న జెట్ 2 విమానంలో తీవ్ర కలకలం రేగింది. సుమారు 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రధాన పైలట్‌కు గుండెపోటు వచ్చింది.
దీంతో విమానాన్ని అత్యవసరంగా పోర్చుగల్‌లోని పోర్టో విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 220 మంది ప్రయాణికులు ఉన్నారు (Jet2 pilot heart attack).
పైలట్ అస్వస్థతకు గురికావడంతో కో-పైలట్ వెంటనే విమానాన్ని నియంత్రించారు. ప్రధాన పైలట్‌కు గుండెపోటు రావడంతో క్యాబిన్ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురై, విమానంలో ఎవరైనా డాక్టర్లు, వైద్య శిక్షణ పొందినవారు ఉన్నారా అంటూ సహాయం కోరినట్లు ప్రయాణికులు తెలిపారు. అత్యవసర ల్యాండింగ్ కోసం విమానాన్ని వేగంగా కిందికి దించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చిన్నపిల్లలు ఏడవడం, లైట్లు ఫ్లాష్ అవ్వడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు (Emergency landing Portugal).
చివరకు విమానం పోర్టోలో సురక్షితంగా ల్యాండ్ అయింది (Pilot medical emergency). వెంటనే అత్యవసర వైద్య సిబ్బంది విమానంలోకి వెళ్లి పైలట్‌కు చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం ప్రయాణికులు దాదాపు 13 గంటల పాటు పోర్చుగల్‌లోనే చిక్కుకుపోయారు. అనంతరం మరో పైలట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత విమానం బర్మింగ్‌హామ్‌కు బయలుదేరింది.

