Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
40 ఏళ్ల నాకౌట్ శాపానికి తెర.. ఈక్వెడార్‌ను చిత్తు చేసిన మెక్సికో

40 ఏళ్ల నాకౌట్ శాపానికి తెర.. ఈక్వెడార్‌ను చిత్తు చేసిన మెక్సికో

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆతిథ్య మెక్సికో జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. తమకు కలిసొచ్చిన 'అజ్టెకా స్టేడియం'లో ఇవాళ (బుధవారం) జరిగిన రౌండ్-32 నాకౌట్ మ్యాచ్‌లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో ఈక్వెడార్‌ను చిత్తు చేసింది.

ఈ విజయంతో ఏకంగా 40 ఏళ్లుగా వెంటాడుతున్న ప్రపంచ కప్ నాకౌట్ శాపానికి మెక్సికో తెరదించింది. చివరిసారిగా 1986లో తమ దేశంలోనే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చినప్పుడు మెక్సికో నాకౌట్ మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు నాకౌట్ మ్యాచ్‌లో విజయం సాధించి.. ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో మెక్సికో ఆది నుంచే ఈక్వెడార్‌పై ఎదురుదాడికి దిగింది. మ్యాచ్ 22వ నిమిషంలో జూలియన్ క్వినోనెస్ ఒక అద్భుతమైన్ గోల్‌తో మెక్సికోకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 30వ నిమిషంలో క్వినోనెస్ అందించిన అద్భుతమైన పాస్‌ను ఫుల్హామ్ స్ట్రైకర్ రౌల్ జిమెనెజ్ గోల్‌గా మలిచి జట్టు ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఈక్వెడార్ ఆటగాడు జాన్ యెబోవా గోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ మెక్సికో కీపర్ రౌల్ రంగెల్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో మ్యాచ్ ముగిసే సమయానికి ఈక్వెడార్ ఆటగాడు పీరో హించాపి రఫ్ బిహేవియర్ కారణంగా రెడ్ కార్డ్ పొంది మైదానాన్ని వీడాడు.

పీలే సరసన మొరా..

ఈ మ్యాచ్ ద్వారా మెక్సికోకు చెందిన 17 ఏళ్ల గిల్బెర్టో మొరా సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన రెండో అతి పిన్న వయస్కుడిగా మొరా నిలిచాడు. 1958లో బ్రెజిల్ దిగ్గజం పీలే సృష్టించిన రికార్డు తర్వాత ఆ ఘనత సాధించింది మొరానే కావడం విశేషం. ప్రస్తుత టోర్నీలో గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లతో పాటు ఈ మ్యాచ్‌లోనూ మెక్సికో ఒక్క గోల్ కూడా సమర్పించుకోకుండా అజేయంగా దూసుకుపోతోంది. ఆదివారం జరగబోయే రౌండ్-16 పోరులో ఆయా మ్యాచుల ఫలితాలను బట్టి ఇంగ్లండ్ లేదా కాంగోతో మెక్సికో తలపడనుంది.

కార్డులపై అభిషేక్ శర్మ కన్ను.. రోహిత్, హార్దిక్ మార్కులను దాటేసేందుకు లక్కీ ఛాన్స్!

రెండోసారీ రిటైర్మెంట్.. జర్మనీ గోల్‌కీపర్ నోయర్ సంచలన నిర్ణయం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy