Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రికార్డులపై అభిషేక్ శర్మ కన్ను.. రోహిత్ మార్క్‌ను దాటేసేందుకు లక్కీ ఛాన్స్!

రికార్డులపై అభిషేక్ శర్మ కన్ను.. రోహిత్ మార్క్‌ను దాటేసేందుకు లక్కీ ఛాన్స్!

స్పోర్ట్స్ డెస్క్: భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇవాళ్టి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. ఐర్లాండ్ పర్యటనలో 0-2తో ఎదురైన పరాజయం తర్వాత టీమిండియా కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఇది అత్యంత కీలకమైన సిరీస్ కానుంది.

ఈ పోరులో ఇరు జట్లలోని స్టార్ ఆటగాళ్లు పలు రికార్డులపై కన్నేశారు. ముఖ్యంగా టీమిండియా యువ ఆటగాళ్లు ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వంటి సీనియర్ల రికార్డులను బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

అభిషేక్ శర్మ:

ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా దూసుకుపోతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇంగ్లండ్‌పై టీ20ల్లో అత్యధిక పరుగులు (387) చేసిన భారత ఓపెనర్‌గా ఉన్న రోహిత్ శర్మ రికార్డును దాటడానికి అభిషేక్‌కు కేవలం 100 పరుగులు దూరంలో ఉన్నాడు. రోహిత్ కంటే ఆరు ఇన్నింగ్స్‌లు తక్కువ ఆడిన అభిషేక్.. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ మార్కును సులువుగా దాటే అవకాశం ఉంది. అలాగే ఇంగ్లండ్‌పై అత్యధిక సిక్సర్లు (27) బాదిన హార్దిక్ పాండ్య రికార్డును అధిగమించడానికి అభిషేక్‌కు మరో 6 సిక్సర్లు అవసరం కానున్నాయి.

సంజూ శాంసన్

మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ సైతం ఇంగ్లండ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని పేరిట ఉన్న ఏకైక అర్ధశతకం రికార్డును అధిగమించాలని భావిస్తున్నాడు. ఇక గాయం నుంచి కోలుకుని జట్టులోకి పునరాగమనం చేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంగ్లండ్‌పై ఆరు మ్యాచ్‌ల్లోనే 15 వికెట్లు పడగొట్టిన అద్భుతమైన రికార్డు వరుణ్ సొంతం. ఈ సిరీస్‌లో అతడు మరో 6 వికెట్లు తీస్తే.. ఇంగ్లండ్‌పై టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అయ్యర్ సేన ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ నెగ్గాలంటే ఈ ఆటగాళ్ల ప్రదర్శన అత్యంత కీలకం కానుంది.

రెండోసారీ రిటైర్మెంట్.. జర్మనీ గోల్‌కీపర్ నోయర్ సంచలన నిర్ణయం..

ఫిఫా ప్రపంచ కప్ 2026.. స్వీడన్‌పై ఫ్రాన్స్ ఘన విజయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy