Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
40 మీటర్ల ఎత్తునుంచి తోసేశారు.. యువతి ప్రాణం పోయింది..

40 మీటర్ల ఎత్తునుంచి తోసేశారు.. యువతి ప్రాణం పోయింది..

ఇంటర్‌నెట్ డెస్క్: బ్రెజిల్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్వింగ్ జంప్ సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. సిబ్బంది సేఫ్టీ రోప్ కట్టకుండా యువతిని 40 మీటర్ల పైనుంచి కిందపడేశారు.

దీంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సావో పాలోలోని లిమైరాకు చెందిన 21 ఏళ్ల ఓ యువతి జూన్ 13వ తేదీన స్వింగ్ జంప్ చేయడానికి వెళ్లింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసింది. స్వింగ్ జంప్ స్టాఫ్ మెంబర్స్ ఆమెను పైనుంచి కిందకు తోయడానికి ప్లాట్ ఫామ్ దగ్గరకు తీసుకువచ్చారు.

యువతిని చేతులతో ఎత్తుకుని 40 మీటర్ల ఎత్తునుంచి కిందకు తోశారు. గాల్లోకి ఎగరాల్సిన ఆ యువతి నేరుగా భూమిని ఢీకొట్టింది. తీవ్రమైన గాయాల కారణంగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. చనిపోవడానికి ముందు ఆమె పెట్టిన చావు కేకతో స్వింగ్ జంప్ స్టాఫ్ మెంబర్స్‌కు అసలు విషయం అర్థమైంది. ఆమెను కిందకు తోసే సమయంలో సేఫ్టీ రోప్ కట్టలేదని గుర్తించారు. అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయి. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఆమె మరణానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో ప్రమాదానికి సంబంధించిన ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలు ఉన్నాయి. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'అందుకే నేను ఎవ్వరినీ నమ్మను. నమ్మితే ఇలా చనిపోవాల్సి వస్తుంది'.. 'పాపం ఎంతో సంతోషంగా స్వింగ్ జంప్ చేద్దామనుకుంది. ప్రాణం పోయింది' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ కేశినేని చిన్ని సంచలన ఆరోపణలు

ఫిఫా ప్రపంచ కప్: 36 ఏళ్ల తర్వాత.. స్కాట్లాండ్ చారిత్రక విజయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy