Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిఫా ప్రపంచ కప్: 36 ఏళ్ల తర్వాత.. స్కాట్లాండ్ చారిత్రక విజయం

ఫిఫా ప్రపంచ కప్: 36 ఏళ్ల తర్వాత.. స్కాట్లాండ్ చారిత్రక విజయం

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో స్కాట్లాండ్ జట్టు బోణీ కొట్టింది. 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచ కప్‌లో విజయం సాధించింది.

శనివారం హైతీపై జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో గెలిచింది. అయితే 1990లో స్వీడన్‌పై 2-1 తేడాతో స్కాట్లాండ్ విక్టరీ సాధించడం గమనార్హం. 1998 తర్వాత జరిగిన మేజర్ ఈవెంట్లలో గెలవడం కూడా ఇప్పుడే కావడం విశేషం.

మ్యాచ్ ఆరంభం నుంచే స్కాట్లాండ్ దూకుడుగా ఆడింది. అయితే స్కాట్లాండ్ ప్లేయర్ జాన్ మెక్‌గిన్ 28వ నిమిషంలో బ్రేక్‌థ్రూ లభించింది. అడమ్స్ కొట్టిన షాట్‌ను గోల్ కీపర్ అడ్డుకున్నప్పటికీ రీబౌండ్‌గా వచ్చిన బంతిని జాన్ మెక్‌గిన్ గోల్ కొట్టాడు. దీంతో స్కాట్లాండ్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ గోల్‌తో ప్రపంచ కప్‌లో స్కాట్లాండ్ తరఫున గోల్ చేసిన అత్యంత ఎక్కువ వయసున్న ప్లేయర్‌గా మెక్‌గిన్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్ ఇదే. ఆ తర్వాత కూడా హైతీ గోల్ కొట్టేందుకు తీవ్రంగా పోరాడింది. దాదాపు 13 సార్లు గోల్ కోసం హైతీ ప్రయత్నించింది. అయినప్పటికీ స్కాట్లాండ్ డిఫెండ్ ముందు అది వర్కౌట్ కాలేదు. స్కాట్లాండ్ కేవలం 8 సార్లు మాత్రమే గోల్ కోసం టార్గెట్ చేసి ఒకసారి విజయం సాధించింది. ఈ గెలుపుతో స్కాట్లాండ్ జట్టు గ్రూప్ సి పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తదుపరి మ్యాచ్‌లో జూన్ 19న మొరాకోతో తలపడనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy