డిగ్రీ పట్టా అందుకొన్న బిల్లీ జీన్ కింగ్
లాస్ ఏంజిల్స్: టెన్నిస్ గ్రేట్ బిల్లీ జీన్ కింగ్ (82) లేటు వయసులో పట్టభద్రురాలైం ది. కాలేజీలో చేరిన 65 ఏళ్ల తర్వాత పట్టాను అందుకొంది.
కాల్ స్టేట్ లాస్ ఏంజిల్స్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో ఆమె బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. 'సాధించాలన్న సంకల్పం ఉంటే.. ఏదీ అడ్డుకాద'ని పట్టా ప్రదాన కార్యక్రమంలో జీన్ చెప్పింది.

