హైదరాబాద్, జూన్6 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సర్ అధికారులతో మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) ఈరోజు(శనివారం) సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. మహిళా భవనాల నిర్మాణ పురోగతిని రోజూ పరిశీలిస్తామని తెలిపారు. మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు. 8 వేల గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు.
ఇవి మహిళల ఆత్మగౌరవ భవనాలని మంత్రి సీతక్క అభివర్ణించారు. ఈ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. ఎంపీడీవోలు ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత, పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులు నిరంతర పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. ఉపాధి హామీ పనుల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి పనుల్లో లక్ష్యాల సాధించాలని అధికారులకు.. మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
.
రెండేళ్ల ప్రజా తీర్పు.. ఏపీ అభివృద్ధికి నాంది: చంద్రబాబు
పవన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు: రాంచందర్ రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News

