Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆకాశ్‌దీప్‌పై గిల్ అసహనం.. కెప్టెన్ తీరును తప్పుబట్టిన రహానె!

ఆకాశ్‌దీప్‌పై గిల్ అసహనం.. కెప్టెన్ తీరును తప్పుబట్టిన రహానె!

స్పోర్ట్స్ డెస్క్‌: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా భారత్‌ పేసర్‌ ఆకాశ్‌దీప్‌ (Akash Deep)పైన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Subhman Gill) వ్యవహరించిన తీరును మాజీ క్రికెటర్‌ అజింక్య రహానె (Rahane) తప్పుబట్టాడు.

కెప్టెన్ అనే వ్యక్తి క్లిష్ట పరిస్థితుల్లో జట్టు సభ్యులకు మద్దతుగా ఉండాలే తప్ప.. విమర్శలు చేయకూడదని హితవు పలికాడు. మరి.. రహానె ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశాడు, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

వెల్లింగ్టన్ టెస్టులో న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 71వ ఓవర్‌ తొలి బంతిని డారిల్‌ మిచెల్‌ మిడాన్‌ మీదుగా బాదాడు. సగం పిచ్‌ దాటేసిన అతడిని.. అవతలి ఎండ్‌లో ఉన్న బ్లండెల్‌ వెనక్కి వెళ్లమంటూ సంకేతం ఇచ్చాడు. ఇక మిడాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఆకాశ్‌.. బంతిని సరైన సమయంలో అందుకొని స్ట్రైకింగ్‌ ఎండ్‌ వైపు విసరలేకపోవడంతో మిచెల్ త్రుటిలో తప్పించుకున్నాడు. అప్పటికే వికెట్ల కోసం ఎదురు చూస్తున్న గిల్.. ఆకాశ్‌ తప్పిదంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

దీనిపై ఓ టీవీ ఛానల్‌లో రహానె మాట్లాడుతూ.. ఆకాశ్‌కు మద్దతుగా నిలిచాడు. ఆటలో ఇవన్నీ సహజమని.. అంతమాత్రన సహచరుడిపై చిరాకు పడటం సరైన పద్ధతి కాదని హితవు పలికాడు. ‘బంతివైపు చూడకుండా.. తర్వాతి ఓవర్‌ను ఎలా వేయాలనే దాని గురించి ఆకాశ్‌ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోందని, అందుకే సరిగా స్పందించలేకపోయాడని తెలిపాడు. ఇలాంటి సందర్భంలో కెప్టెన్‌తో పాటు సహచర ఆటగాళ్ల మద్దతు చాలా అవసరని రహానె అన్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ల పోరాడటంతో వెల్లింగ్టన్ టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

strong>

భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన యూఏఈ

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 28 బంతుల్లోనే సెంచరీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy