Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌పై సస్పెన్షన్ వేటు

ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌పై సస్పెన్షన్ వేటు

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకున్న ఆనందంలో ఉన్న ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌కు షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతడిపై వేటు పడింది.

టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో బీసీసీఐ 50 శాతం కోత విధించి.. 2 డీమెరిట్ పాయింట్లు అతడి ఖాతాలో వేసింది. దీంతో వచ్చే సీజన్‌లో ఆర్సీబీ తొలి మ్యాచ్‌కు టిమ్ డేవిడ్ నిషేధం ఎదుర్కోనున్నాడు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో వికెట్ పడిన అనంతరం టిమ్ డేవిడ్ ఆగ్రహంతో ఐస్ బ్యాగ్‌ను అంపైర్ నితిన్ మీనన్ వైపు విసిరినట్లు మ్యాచ్ రిఫరీ గుర్తించారు. ఇది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.9 ఉల్లంఘనగా తేలింది. ఈ నిబంధన ప్రకారం ప్లేయర్ లేదా మ్యాచ్ అధికారుల వైపు ప్రమాదకరంగా క్రికెట్ సామగ్రి లేదా ఇతర వస్తువులను విసరడం నేరంగా పరిగణిస్తారు. తన తప్పును టిమ్ డేవిడ్ అంగీకరించడంతో పాటు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ విధించిన శిక్షను స్వీకరించాడు. ఇప్పటికే అతడి ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. మొత్తంగా 5 పాయింట్లకు చేరింది. దీంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించారు. ఫలితంగా టిమ్ డేవిడ్ ఐపీఎల్ 2027లో ఆర్సీబీ తరఫున లేదా తాను ప్రాతినిధ్యం వహించే ఫ్రాంచైజీ తరఫున ఆడే తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy