Dailyhunt
ఆర్టీసీ బస్సు బోల్తా.. ప్రయాణికులకు తీవ్రగాయాలు

ఆర్టీసీ బస్సు బోల్తా.. ప్రయాణికులకు తీవ్రగాయాలు

ద్వాల్, ఫిబ్రవరి 19: జోగులాంబ గద్వాల జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19మంది ప్రయాణికులు గాయపడగా.. వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

గురువారం తెల్లవారుజామున ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. రహదారిపై బస్సు బోల్తా పడడంతో.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు వెంటనే రహదారిపై నుంచి ఆర్టీసీ బస్సుకు పక్కకు తొలగించారు. దీంతో రహదారిపై నిలిచిపోయిన వాహనాలు ముందుకు సాగాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy