Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసియా గేమ్స్: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు భారత్

ఆసియా గేమ్స్: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు భారత్

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో భాగంగా నేడు జరగాల్సిన భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ రద్దు అయింది. భారీ వర్షం కారణంగా టాస్ పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

దీంతో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు వచ్చిన టీమిండియానే.. సెమీస్‌కు అర్హత సాధించింది. దురదృష్టవశాత్తు మ్యాచ్ ఆడకుండానే అఫ్గాన్ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

మరోవైపు పాకిస్థాన్-హాంగ్ కాంగ్ మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్స్ కారణంగా పాకిస్థాన్ అధికారికంగా సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. మంగళవారం బంగ్లాదేశ్-మలేసియా మధ్య జరగనున్న క్వార్టర్ ఫైనల్‌ విజేత జట్టుతో పాక్ సెమీస్‌లో తలపడనుంది. మరోవైపు శ్రీలంక-నేపాల్ జట్ల మధ్య జరగనున్న క్వార్టర్ ఫైనల్ విజేత జట్టుతో భారత్ సెమీస్‌లో పోటీ పడనుంది.

strong>

POTM అవార్డు తీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది: కుల్‌దీప్ యాదవ్

భారత్ తరఫున ఆడే ప్రతి నిమిషాన్నీ ఆస్వాదిస్తున్నా: విరాట్ కోహ్లీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy