Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసియా క్రీడలు: డబుల్ బొనాంజా.. కబడ్డీలో భారత్‌కు మరో స్వర్ణం

ఆసియా క్రీడలు: డబుల్ బొనాంజా.. కబడ్డీలో భారత్‌కు మరో స్వర్ణం

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో కబడ్డీ జట్లు అదరగొట్టాయి. శనివారం భారత పురుషుల కబడ్డీ కూడా స్వర్ణ పతకం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి టీమిండియా..

ఇరాన్‌పై 40-34 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈ గెలుపుతో ఆసియా క్రీడల చరిత్రలో కబడ్డీ జట్టు రికార్డు స్థాయిలో గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషం. అంతకుముందు మహిళా కబడ్డీ జట్టు కూడా ఇరాన్‌పై గెలిచి పసిడిని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఒకేరోజు కబడ్డీలో భారత్ ఖాతాలో రెండు స్వర్ణ పతకాలు వచ్చి చేరాయి.

పురుషుల ఫైనల్‌లో భారత్‌కు ఇరాన్‌ గట్టి పోటీ ఇచ్చింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత జట్టు 17-18తో వెనుకబడింది. ప్రతి పాయింట్‌ కోసం ఇరు జట్లు తీవ్రంగా పోరాడాయి. దీంతో మ్యాచ్‌ ఉత్కంఠగా సాగింది. అయితే రెండో అర్ధభాగంలో కెప్టెన్‌ సునీల్‌ కుమార్‌ నేతృత్వంలోని భారత జట్టు గేర్‌ మార్చింది. డిఫెన్స్‌ను పటిష్టం చేయడంతో పాటు రైడింగ్‌లోనూ వేగం పెంచింది. వరుసగా పాయింట్లు సాధిస్తూ ఇరాన్‌పై ఒత్తిడి పెంచింది. చివరికి 40-34తో మ్యాచ్‌ను సొంతం చేసుకుని స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.

పట్టికలో పదో స్థానం..

ఆసియా క్రీడలు 2026లో ఇప్పటివరకు నాలుగు స్వర్ణాలతో భారత్ పతకాల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. 11 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి మొత్తంగా భారత్ 28 పతకాలను సొంతం చేసుకుంది.

strong>

ఆసియా క్రీడలు: క్వార్టర్ ఫైనల్‌లో భారత్ తలపడేది ఆ జట్టుతోనే..!

శుభ్‌మన్ గిల్ సుదీర్ఘకాలం కెప్టెన్‌గా కొనసాగుతాడు: విరాట్ కోహ్లీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy