Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్‌ను అవమానించిన విరాట్ కోహ్లీ !

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్‌ను అవమానించిన విరాట్ కోహ్లీ !

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడాయి. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 55 పరుగుల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది.

అయితే మెరుగైన రన్‌రేట్ లేకపోవడంతో హైదరాబాద్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌ను అవమానించినట్లుగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

శుక్రవారం జరిగిన ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ-ట్రావిస్‌ హెడ్‌ మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో వెంకటేష్‌ అయ్యర్‌ భారీ షాట్లు ఆడుతుండగా.. హెడ్‌ పట్ల కోహ్లీ చాలా ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించాడు. నువ్వే వచ్చి బౌలింగ్‌ చేయ్యి అంటూ సైగలు చేయడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. హెడ్‌ మాత్రం చిరునవ్వుతో స్పందించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మ్యాచ్‌ అనంతరం ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకుంటుండగా.. హెడ్‌ పట్ల కోహ్లీ మరోసారి అవమానకరంగా ప్రవర్తించాడు.

కమిన్స్‌, అభిషేక్‌ శర్మలతో మాట్లాడి.. హెడ్‌ వద్దకు వచ్చేసరికి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ముందుకు సాగిపోయాడు. కోహ్లీ ఇలా చేయడంతో క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. అయితే ఈ ఘటనపై కూడా కొందరు కోహ్లీకి సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ అంత ఈజీగా ఎవర్నీ అవమానించడని, అక్కడ ఏదో జరిగి ఉంటుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 255/4 భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేయగలిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy