ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు-2026లో రజత పతకం సాధించిన తమిళనాడుకు చెందిన స్క్వాష్ అథ్లెట్ అభయ్ సింగ్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.
పురుషుల సింగిల్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన అభయ్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అభినందించారు. అతడి ప్రతిభను గుర్తిస్తూ రూ.50 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు వెల్లడించారు.
అభయ్‌ను అభినందిస్తూ సీఎం విజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో పురుషుల సింగిల్స్ స్క్వాష్‌లో రజత పతకం సాధించి తమిళనాడు, భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన అభయ్ సింగ్‌కు నా హృదయపూర్వక అభినందనలు. అతడి అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం రూ.50 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. అభయ్ విజయం తమిళనాడులోని యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నా' అని సీఎం విజయ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఇప్పటికే పలువురికి నజరానా
ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తమిళనాడు క్రీడాకారులకు సీఎం విజయ్ ఇప్పటికే పలు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. భారత మహిళల టీ20 జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించడంలో భాగమైన మదురైకి చెందిన యువ క్రికెటర్ జి. కమలినికి రూ.75 లక్షలు ప్రకటించారు. అదే విధంగా 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో రజతం సాధించిన తమిళనాడు అథ్లెట్లు విద్య రామ్‌రాజ్, విశాల్‌లకు చెరో రూ.50 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు.
strong>
ఆసియా క్రీడలు: డబుల్ ధమాకా.. స్క్వాష్‌లో భారత్‌కు రెండు రజతాలు

