Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసియా క్రీడలు: డబుల్ ధమాకా.. స్క్వాష్‌లో భారత్‌కు రెండు రజతాలు

ఆసియా క్రీడలు: డబుల్ ధమాకా.. స్క్వాష్‌లో భారత్‌కు రెండు రజతాలు

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో రెండు రజత పతకాలు వచ్చి చేరాయి. స్క్వాష్‌లో స్టార్ అథ్లెట్ అనాహత్ సింగ్ మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించింది.

ఫైనల్‌లో ఆమె మలేసియాకు చెందిన శివశంగరి సుబ్రహ్మణ్యం చేతిలో 4-11, 4-11, 7-11 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఆసియా క్రీడల మహిళల సింగిల్స్‌లో రజతం దక్కించుకున్న తొలి భారత మహిళగా ఈ 18 ఏళ్ల యువ అథ్లెట్ అనాహత్ చరిత్ర సృష్టించింది.

ఇప్పటివరకు భారత స్క్వాష్‌ దిగ్గజాలు దీపికా పల్లికల్‌, జోత్స్న చిన్నప్ప కూడా మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకాలతోనే సరిపెట్టుకున్నారు. అయితే 18 ఏళ్ల అనాహత్‌ వారి రికార్డును అధిగమించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో అభయ్‌ సింగ్‌ కూడా రజతం సాధించాడు. ఫైనల్‌లో మలేసియా ఆటగాడు ఎన్‌గ్‌ ఈన్‌ యో చేతిలో 0-3తో ఓడిపోయాడు. 9-11, 5-11, 5-11తో వరుస గేముల్లో పరాజయం చవిచూశాడు. అయితే ఆసియా క్రీడల పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరిన రెండో భారతీయ స్క్వాష్‌ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ ఘనతను సౌరభ్ ఘోషల్‌ సాధించాడు. అంతేకాదు.. ఈ ఆసియా క్రీడలు భారత్‌ స్క్వాష్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోనున్నాయి. ఒకే ఎడిషన్‌లో పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగాల రెండింటిలోనూ భారత అథ్లెట్లు సిల్వర్ సాధించడం ఇదే తొలిసారి.

strong>

శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా

నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy