Dailyhunt
అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్

అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనలు చేస్తోంది. వరుస నాలుగు విజయాలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉంది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఐదు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

శనివారం రాజస్థాన్ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్ అనంతరం టీమ్ హోటల్ వద్ద ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఎస్ఆర్‌హెచ్ విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మను ఓ లేడీ ఫ్యాన్స్ చేయి పట్టుకుని లాగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైరల్ వీడియో ప్రకారం.. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనంతరం హైదరాబాద్ ప్లేయర్లు టీమ్ హోటల్‌కు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మను చూసి ఉత్సాహానికి లోనైన ఓ ఫ్యాన్ గర్ల్ సెక్యూరిటీని దాటుకుని అతడి దగ్గరకు చేరింది. ఆ సమయంలో అభిషేక్ చేతిని బలవంతంగా పట్టుకుని లాగింది. ఈ అనూహ్య ఘటనతో అభిషేక్ ఒక్కాసారిగా షాకయ్యాడు. కాస్త ఇబ్బందికి గురవుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భద్రతా సిబ్బంది అక్కడే ఉన్నప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడంతో సెక్యూరిటీ లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

అభిషేక్ విధ్వంసం..

ఇక మ్యాచ్‌ల విషయానికొస్తే.. అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. రాజస్థాన్‌పై 229 పరుగుల లక్ష్య ఛేదనలో అతడు కేవలం 29 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌తో అభిషేక్ మరో మైలురాయిని కూడా అందుకున్నాడు. ఎస్ఆర్‌హెచ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ విలియమ్సన్‌ను దాటి మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 82 మ్యాచ్‌ల్లో 2,133 పరుగులు చేశాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy