Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అఫ్గాన్ సిరీస్: సంజు వచ్చాడు.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కేనా..?

అఫ్గాన్ సిరీస్: సంజు వచ్చాడు.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కేనా..?

ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించే వైభవ్..

అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 13 నుంచి టీమిండియా.. అఫ్గానిస్థాన్‌లో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అటు వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.

ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన సంజును జట్టు నుంచి తప్పించి వైభవ్‌కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇంగ్లండ్‌పై నిరాశపరిచిన వైభవ్.. జింబాబ్వేపై చెలరేగాడు. అయితే అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలే అవకాశం ఉంది. ఎప్పటిలాగే సీనియర్ ప్లేయర్లు సంజు శాంసన్-అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. అక్కడ సంజు లేదా అభిషేక్ విఫలమైతేనే వైభవ్‌కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

మరోవైపు, దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6 నుంచి ఫైనల్ మ్యాచ్‌లో ఆడనున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ ఇద్దరూ అఫ్గాన్ సిరీస్ కల్లా సిద్ధంగా ఉంటారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.

strong>

సీఎస్కే కోచ్‌ విషయంలో అప్పుడే తొందరెందుకు?: రుతురాజ్ గైక్వాడ్

చైనా మాస్టర్స్: టోర్నీ నుంచి లక్ష్యసేన్‌ ఔట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy